2015లో కాంపాక్ట్ ఎస్‌‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్

By Ravi

ఇటీవలే ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసిన కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, ఇప్పుడు కాంపాక్ట్ ఎస్‌‌యూవీ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఓ అధునాత కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది.

కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపిన సమాచారం ప్రకారం, 2015లో హ్యుందాయ్ తమ తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఐఎక్స్35 కాన్సెప్ట్‌కి స్మాలర్ వెర్షన్ అయిన హ్యుందాయ్ ఐఎక్స్25 ఈ విభాగానికి చక్కగా సూట్ అవుతుంది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చైనాలో జరిగిన బీజింగ్ అంతర్జాతీయ మోటార్ షోలో హ్యుందాయ్ తమ ఐఎక్స్25 కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. నాలుగు మీటర్ల కొంచెం పొడవుండే హ్యుందాయ్ ఐఎక్స్25 భారత మార్కెట్లో కాంపాక్ట్ కార్లపై ఇచ్చే ఎక్సైజ్ రాయితీలను పొందలేకపోవచ్చు కానీ, డస్టర్‌కు మాత్రం గట్టి పోటీ ఇవ్వగలదు.

Hyundai Compact SUV India Launch In 2015

హ్యుందాయ్ ఐఎక్స్25 4207 మి.మీ. పొడవును, 1780 మి.మీ. వెడల్పును, 1630 మి.మీ. ఎత్తును కలిగి ఉండి, 2590 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. హ్యుందాయ్ ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఐఎక్స్25 కాన్సెప్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేశారు.

ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, హెక్సాగనల్ క్రోమ్ గ్రిల్, పెద్ద బంపర్, బంపర్‌కే అమర్చిన ఫాగ్ ల్యాంప్స్, స్కిడ్ ప్లేట్స్ వంటి వాటి వలన ఇది స్టన్నింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ స్థానాన్ని (ద్వితీయ) పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడి మార్కెట్లో హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు జోరుగా సాగే ఆస్కారం ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Tuesday, June 3, 2014, 18:31 [IST]
English summary
Hyundai India will enter the the very active compact SUV segment in the country with the launch of a new, yet unnamed, model in 2015. The confirmation comes from Rakesh Srivastava, the company's Senior Vice President of Marketing and Sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+