హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్ 2013: కార్లపై భారీ డిస్కౌంట్స్
డిసెంబర్ నెల అంటేనే డిస్కౌంట్ల పండుగ. సరమైన ధరకే సరికొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ డిసెంబర్ మాసం ఎంతో అనువైనది. స్టాక్ క్లియర్ చేసుకునేందుకు, తమ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు అనేక కార్ కంపెనీలు ఈ నెలలో తమ ఉత్పత్తులపై ఇదివరకెన్నడూ లేని విధంగా భారీగా తగ్గింపులను ఆఫర్ చేస్తుంటాయి.
ఇప్పటికే పలు కార్ కంపెనీలు ఆఫర్లను అందిస్తుంటే. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ చిన్న కారు ఇయాన్ మొదలుకొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకూ వివిధ మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులను, ప్రోత్సాకాలను ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ అందిస్తున్న ఆఫర్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డిసెంబర్ డిలైట్ 2013లో భాగంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్లపై అందిస్తున్న డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ ఇయాన్ కారుపై రూ.43,250 విలువైన ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ శాంత్రో
హ్యుందాయ్ శాంత్రో కారుపై రూ.56,000 వరకు విలువైన ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది.

హ్యుందాయ్ ఐ10
ఈ డిసెంబర్ హ్యుందాయ్ ఐ10 కారును కొనుగోలు చేసే కస్టమర్లు రూ.66,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

హ్యుందాయ్ ఐ20
పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20పై రూ.38,000 మరియు డీజిల్ వెర్షన్‌పై 48,000 విలువైన ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ అందిస్తున్న మిడ్ సైజ్ సెడాన్ వెర్నా పెట్రోల్ వెర్షన్‌పై రూ.30,000 వరకు, అలాగే డీజిల్ వెర్షన్‌పై రూ.54,000 వరకు విలువైన ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు.

హ్యుందాయ్ ఎలాంట్రా
హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రాపై రూ.75,000 వరకు సేవింగ్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ సొనాటా
హ్యుందాయ్ లగ్జరీ సెడాన్ సొనాటాపై రూ.1,39,000 వరకు విలువైన సేవింగ్స్‌ను కస్టమర్లు పొందవచ్చు.

హ్యుందాయ్ శాంటాఫే
హ్యుందాయ్ అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ శాంటాఫేపై రూ.1,45,000 వరకు సేవింగ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే, వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








