బెంగుళూరులో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

బెంగుళూరు: హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ సరికొత్త 'ఎలైట్ ఐ20' (Elite i20) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను నేడు (ఆగస్ట్ 12, 2014) బెంగుళూరు మార్కెట్లో విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో దీని ప్రారంభ ధర కేవలం రూ.4.98 లక్షలు (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. కొత్త 2014 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది.

హ్యుందాయ్ 2008లో తమ మొదటి తరం (ఫస్ట్ జనరేషన్) ఐ20ని మార్కెట్లో విడుదల చేసింది. కాగా.. తాజాగా హ్యుందాయ్ విడుదల చేసిన ఎలైట్ ఐ20 రెండవ తరానికి (సెకండర్ జనరేషన్) చెందినది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేశారు. యంగ్ మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లను టార్గెట్‌గా చేసుకొని హ్యుందాయ్ ఎలైట్ ఐ20ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

తర్వాతి స్లైడ్‌లలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫీచర్స్, ఇంజన్ ఆప్షన్స్, మైలేజ్, ధరలు తదితర వివరాలను తెలుసుకోండి.

స్టయిలింగ్ - ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0

స్టయిలింగ్ - ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0

సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్‌ను కంపెనీ అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా తయారు చేశారు. ఇది మోడ్రన్ అప్పీల్, ప్రీమియం ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు.

స్టయిలిష్ ప్రీమియం ఎక్స్టీరియర్స్

స్టయిలిష్ ప్రీమియం ఎక్స్టీరియర్స్

బోల్డ్‌గా ఉండే పెద్ద హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, పెద్దగా ఉండే సరికొత్త బానెట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, వెడల్పుగా ట్రాపేజోడియల్ షేపులో ఉండే ఫాగ్ ల్యాంప్స్, ప్రీమియం 2-టోన్ 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ అండ్ స్టయిలిష్ బ్లాక్ సి పిల్లలర్, ప్రీమియం క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్, వెడల్పుగా ఉండే హై-టెక్ 3-స్టెప్ వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

ప్రీమియం రీడిఫైన్డ్ ఇంటీరియర్స్

ప్రీమియం రీడిఫైన్డ్ ఇంటీరియర్స్

ఇందులో స్పోర్టీ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, 1జిబి ఇంటర్నల్ మెమరీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, హై-టెక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, విశాలమైన క్యాబిన్, లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్, 285 లీటర్ బూట్ స్పేస్, రియర్ ఏసి వెంట్స్, ఎఫ్ఏటిసి (ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్), స్టోరేజ్ బాక్స్‌తో కూడిన కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టమెంట్, సెంటర్ కన్సోల్‌లో కార్డ్ హోల్డర్, సన్‌గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ అండ్ రియర్ డోర్స్‌లో మ్యాప్ పాకెట్స్ వంటి అనేక ఇంటీరియర్ ఫీచర్లు దీని సొంతం.

అధునాతన మరియు హై-టెక్ ఫీచర్లు

అధునాతన మరియు హై-టెక్ ఫీచర్లు

బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో అండ్ బ్లూటూత్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటో ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి స్మార్ట్ అండ్ హై-టెక్ ఫీచర్లు దీని సొంతం.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), స్మార్ట్ పెడల్ (బ్రేక్), ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్, స్టీరింగ్ అడాప్టివ్ పార్కింగ్ గైడ్ లైన్స్‌తో కూడిన అడ్వాన్స్డ్ రియర్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్స్

సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్స్

స్పోర్టీ అండ్ స్టయిలిష్ బ్లాక్ సి పిల్లర్, స్టోరేజ్ బాక్స్‌తో ఫ్రంట్ కన్సోల్ ఆర్మ్ రెస్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, క్లస్టర్ ఐయోనైజర్ (క్యాబిన్‌లో దుర్ఘందం లేని స్వచ్ఛమైన గాలి కోసం), 2-టోన్ డైమండ్ కట్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆడియో సిస్టమ్‌లో 1జిబి ఇంటర్నల్ మెమరీ, స్మార్ట్ పెడల్ (బ్రేకింగ్ సేఫ్టీ కోసం), అడ్వాన్స్డ్ ప్రీమియం లుకింగ్ సూపర్‌విజన్ క్లస్టర్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఎలైట్ ఐ20లోనే లభిస్తాయి.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

మైలేజ్

మైలేజ్

పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్

పెట్రోల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్

డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్

డీజిల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్

ఎలైట్ ఐ20 (1.2లీ పెట్రోల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 (1.2లీ పెట్రోల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 ఎరా - రూ.4.98 లక్షలు

ఎలైట్ ఐ20 మాగ్నా - రూ.5.51 లక్షలు

ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ - రూ.6.04 లక్షలు

ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ (ఆప్షనల్) - రూ.6.36 లక్షలు

ఎలైట్ ఐ20 ఆస్టా - రూ.6.58 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

ఎలైట్ ఐ20 (1.4లీ డీజిల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 (1.4లీ డీజిల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 ఎరా - రూ.6.20 లక్షలు

ఎలైట్ ఐ20 మాగ్నా - రూ.6.73 లక్షలు

ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ - రూ.7.26 లక్షలు

ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ (ఆప్షనల్) - రూ.7.58 లక్షలు

ఎలైట్ ఐ20 ఆస్టా - రూ.7.80 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

వీడియో

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 టెలివిజన్ కమర్షియల్‌ను ఈ స్లైడ్‌లో తిలకించండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2014, 13:13 [IST]
English summary
Hyundai Motor India has launched the all-new Elite i20 in Bangalore. A sporty, dynamic and innovative hatchback with class leading unique features, the all-new Elite i20 has been designed using Hyundai’s evolved Fluidic Sculpture 2.0 philosophy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+