హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల: ధర రూ.4.89 లక్షలు

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో ఆఫర్ చేస్తున్న ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు (ఆగస్ట్ 11, 2014) మార్కెట్లో విడుదల చేసింది.

'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) పేరుతో విడుదలైన ఈ స్టయిలిష్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర కేవలం రూ.4.89 లక్షలు మాత్రమే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది.

ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు. దీని ఇంజన్ ఆప్షన్స్, ధరలు, వేరియంట్లు, మైలేజ్ తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

తర్వాతి స్లైడ్‌లలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంజన్ ఆప్షన్ల్, మైలేజ్, ధరలు తదితర వివరాలను తెలుసుకోండి.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

మైలేజ్

మైలేజ్

పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్

పెట్రోల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్

డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్

డీజిల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్

ఎలైట్ ఐ20 (1.2లీ పెట్రోల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 (1.2లీ పెట్రోల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 ఎరా - రూ.4.89 లక్షలు

ఎలైట్ ఐ20 మాగ్నా - రూ.5.41 లక్షలు

ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ - రూ.5.93 లక్షలు

ఎలైట్ ఐ20 ఆస్టా - రూ.6.46 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఎలైట్ ఐ20 (1.4లీ డీజిల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 (1.4లీ డీజిల్ వెర్షన్ ధరలు):

ఎలైట్ ఐ20 ఎరా - రూ.6.09 లక్షలు

ఎలైట్ ఐ20 మాగ్నా - రూ.6.61 లక్షలు

ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ - రూ.7.13 లక్షలు

ఎలైట్ ఐ20 ఆస్టా - రూ.7.66 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంటీరియర్ వ్యూ

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ఏసి వెంట్స్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫ్రంట్ ప్రొఫైల్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 రియర్ ప్రొఫైల్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

స్పేసియస్ క్యాబిన్ విత్ బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్ థీమ్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

టిల్ట్ అండ్ అడ్జస్టబల్ స్టీరింగ్ కాలమ్.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

ఈ కారుకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

వీడియో

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 టెలివిజన్ కమర్షియల్‌ను ఈ స్లైడ్‌లో తిలకించండి.

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2014, 14:15 [IST]
English summary
Hyundai Motor India has launched the new Elite i20 at a starting price of Rs 4.89 lakh, ex-showroom Delhi for the base petrol variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+