షోరూమ్‌లకు చేరిన కొత్త 2014 హ్యుందాయ్ ఎలైట్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20లో 'ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) పేరిట ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇప్పటికే సరికొత్త 2014 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్ కేంద్రాలకు చేరిపోయింది.
హ్యుందాయ్ డీలర్లు తమ కొత్త ఎలైట్ ఐ20 కోసం బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించారు. కస్టమర్ల సందర్శనార్థం కూడా ఈ కారును కొన్ని షోరూమ్‌లలో డిస్‌ప్లేకి ఉంచారు. ఎలైట్ ఐ20 కారును తొలుతగా ఆగస్ట్ 11, 2014వ తేదీన న్యూఢిల్లీలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని హ్యుందాయ్ పేర్కొంది.

ఈ కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో తాజాగా విడుదలైన రిఫ్రెష్డ్ ఫియట్ పుంటో ఇవో, 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
ప్రస్తుత తరం ఐ20తో పోల్చుకుంటే ఈ కొత్త తరం ఎలైట్ ఐ20 డిజైన్ పూర్తిగా సరికొత్తగా కనిపిస్తుంది. ఈ కొత్త ఎలైట్ ఐ20 ముందు వైపు కొత్త హ్యుందాయ్ కంపెనీ సిగ్నేచర్ హెక్సాగనల్ గ్రిల్, మందపాటి థిన్ హారిజాంటల్ స్ట్రిప్, వ్రాప్ అరౌండ్ విండో, బూమర్యాంగ్ షేప్డ్ టెయిల్ లైట్స్‌తో ఇది రిఫ్రెష్డ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే, మరో రెండు రోజుల వరకు ఆగాల్సిందే. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారుకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








