1.0 లీటర్ ఇంజన్ 'హ్యుందాయ్ ఇయాన్' బుకింగ్స్ ఓపెన్
భారత మార్కెట్లో హ్యుందాయ్ కార్స్ ఇండియా అందిస్తున్న చిన్న కారు 'ఇయాన్'లో 1.0 లీటర్ ఇంజన్‌తో కూడిన పవర్‌ఫుల్ వేరియంట్‌ను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ డీలర్లు ఈ పవర్‌ఫుల్ హ్యుందాయ్ ఇయాన్ కోసం ఇప్పటికే బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.
కొత్త 1.0 లీటర్ ఇంజన్ కలిగిన హ్యుందాయ్ ఇయాన్ డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ 1.0 లీటర్ వేరియంట్ కేవలం మిడ్-స్పెక్ మాగ్నా వేరియంట్లో మాత్రం అందుబాటులో ఉండనుంది. ఈ వేరియంట్‌లో ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, కీలెస్ ఎంట్రీ, 13 ఇంచ్ స్టీల్ వీల్స్, ఫుల్ వీల్ కవర్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. కాకపోతే ఇందులో మ్యూజిక్ సిస్టమ్ మాత్రం అందుబాటులో లేదు.

యూరోపియన్ స్పెసిఫిక్ హ్యుందాయ్ ఐ10 కారులో ఆఫర్ చేస్తున్న 1.0 లీటర్ (1000సీసీ), 3-సిలిండర్ పెట్రోల్ తరహా ఇంజన్‌నే ఈ కొత్త పవర్‌ఫుల్ ఇయాన్‌లో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పిల శక్తిని 95 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఇయాన్ మాగ్నా 1.0 వేరియంట్‌లో ఇంజన్ మార్పు తప్ప డిజైన్, స్టయిలింగ్‌లో ఎలాంటి మార్పులు లేవు. మార్కెట్లో దీని ధర రూ.3.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ ఇయాన్ 0.8 లీటర్ (800సీసీ), 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 55 బిహెచ్‌పిల శక్తిని 75 ఎన్ఎమ్‌ల టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. కొత్త ఇయాన్ మాగ్నా 1.0 ఈ సెగ్మెంట్లోని ఆల్టో కె10, డాట్సన్ గో వంటి కాంపాక్ట్ కార్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








