హ్యుందాయ్ నుంచి మరింత శక్తివంతమైన ఇయాన్ కార్

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ 'ఇయాన్'లో ఓ పవర్‌ఫుల్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, కొత్త ఇయాన్ మరింత పెద్దదైన, శక్తివంతమైన ఇంజన్‌ను ఈ చిన్న కారులో ఉపయోగించనున్నారు.

యూరోపియన్ స్పెసిఫిక్ హ్యుందాయ్ ఐ10 కారులో ఆఫర్ చేస్తున్న 1.0 లీటర్ (1000సీసీ), 3-సిలిండర్ పెట్రోల్ తరహా ఇంజన్‌ను ఈ కొత్త పవర్‌ఫుల్ ఇయాన్‌లో ఉపయోగించనున్నారు. యూరోపియన్ వెర్షన్ 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పిల శక్తిని 95 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇండియన్ వెర్షన్ కొంచెం తక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తూ, ఎక్కువ మైలేజ్‌ని ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Hyundai Eon

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ ఇయాన్ కారులో 0.8 లీటర్ (800సీసీ), 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 55 బిహెచ్‌పిల శక్తిని 75 ఎన్ఎమ్‌ల టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

కొత్త పవర్‌ఫుల్ ఇయాన్‌లో ఇంజన్‌తో పాటుగా డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్ ఇయాన్ ఈ సెగ్మెంట్లోని ఆల్టో కె10, డాట్సన్ గో వంటి కాంపాక్ట్ కార్లతో పోటీ పడనుంది. ప్రస్తుత పోటీ వాతావరణంలో, హ్యుందాయ్ నుంచి ఈ పవర్‌ఫుల్ ఇంజన్ కలిగిన ఇయాన్ ఎంతో స్వాగతించదగినది.

More from DriveSpark

Article Published On: Friday, April 11, 2014, 16:35 [IST]
English summary
Hyundai Eon, the smallest, entry level hatchback offered by the Korean car maker is rumoured to receive a significant upgrade in the form of a 1.0-litre petrol engine. The Eon is currently powered by a 0.8-litre, three-cylinder engine rated at 55 bhp and 75 Nm of torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+