ఒక లక్ష మైలురాయిని చేరుకున్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన సెప్టెంబర్ 2013లో భారత మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అతికొద్ది సమయంలోనే ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే ఈ కారును ఒక లక్ష మందికి పైగా కస్టమర్లకు కంపెనీ డెలివరీ చేసినట్లు ప్రకటించింది. కేవలం 10 నెలల సమయంలో ఈ రికార్డును సాధించినట్లు హ్యుందాయ్ పేర్కొంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అతికొద్ది సమయంలో ఇంతటి సక్సెస్‌ను సాధించడానికి కారణం ఇందులో సరసమైన ధరకే మెరుగైన మైలేజీనిచ్చే డీజిల్ వేరియంట్ లభ్యం కావటమే. ఈ సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. హ్యుందాయ్ బ్రాండ్‌పై ప్రగాఢ విశ్వాసం ఉంచినందుకు తమ కస్టమర్లకు అభినందనలు తెలియజేశారు.
గ్రాండ్ ఐ10 నాణ్యత, ఫీచర్లు, సాంకేతిక విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించిందని, ఈ మోడల్ లక్ష కుటుంబాలకు చేరువ కావటం సంతోషంగా ఉందని అన్నారు.

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిలుకు 24 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుంది.
డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. హ్యుందాయ్ తాజాగా ఇందులో ఎల్‌పిజి వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








