హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో స్మార్ట్ ఫీచర్స్

By Ravi

గతకొద్ది రోజులుగా చిన్న కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన 2013 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ రేపు (సెప్టెంబర్ 3, 2013న) మార్కెట్లో విడుదల కానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, గ్రాండ్ ఐ10కు సంబంధించిన బ్రోచర్ ఆన్‌లైన్లో లీక్ అయ్యింది. ఈ బ్రోచర్‌ను పరిశీలిస్తే, మునుపటి తరలం ఐ10 కారులో లేని అనేక ఫీచర్లను కొత్త గ్రాండ్ ఐ10 కారులో జోడించినట్లు తెలుస్తోంది.

ఈ బ్రోచర్ ప్రకారం, పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 1.2 లీటర్ కప్పా డ్యూయెల్ విటివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అలాగే డీజిల్ వెర్షన్‌లో సెకండ్ జనరేషన్ 1.1 లీటర్ యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే గ్రాండ్ ఐ10 మొత్తం ఐదు వేరియంట్లలో (ఎరా, మాగ్నా, స్పోర్స్, ఆస్టా, ఆస్టా ఆప్షనల్) లభ్యం కానుంది.

Hyundai Grand i10

కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో స్మార్ట్ కీ (స్పోర్ట్స్, ఆస్టా, ఆస్టా ఆప్షనల్ వేరియంట్లలో), 1 జిబి ఇంటర్నల్ మెమరీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ మరియు స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ (ఆస్టా, ఆస్టా ఆప్షనల్ వేరియంట్లలో), టాప్ ఎండ్ వేరియంట్ స్పోర్ట్స్, ఆస్టాలలో పుష్ బటన్ స్టార్ట్/సాప్ ఫీచర్ వంటివి అందుబాటులో ఉండనున్నాయి.

ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు సెప్టెంబర్ 3న వెల్లడి కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2013, 12:28 [IST]
English summary
Hyundai is all set to launch the Grand i10 in India on 3rd of September. Stay tuned to drivespark.com for more details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+