సెప్టెంబర్ 3న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విడుదల
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈనెల (ఆగస్ట్) ఆరంభంలో తమ సరికొత్త కాంపాక్ట్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (Hyundai Grand i10)ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానున్న ఈ చిన్న కారును సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ కార్లకు మంచి డిమాండ్ ఉండటంతో, హ్యుందాయ్ ఈ కొత్త కారును అభివృద్ధి చేసింది. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
సెప్టెంబర్ 3, 2013వ తేదీ ఉదయం 10.00 గంటల సమయంలో న్యూఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.ఎస్. సియో ఆధ్వర్యంలో ఈ కారును విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఐ10, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 మోడళ్లకు మధ్యలో గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‍ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది పొటోఫీచర్‌లో పరిశీలించండి.

సెప్టెంబర్ 3న విడుదల
సెప్టెంబర్ 3, 2013వ తేదీ ఉదయం 10.00 గంటల సమయంలో న్యూఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా` మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.ఎస్. సియో ఆధ్వర్యంలో ఈ కారును విడుదల చేయనున్నారు.

ఎక్స్టీరియర్స్
ముందుగా ఎక్స్టీరియర్స్‌ను గమనిస్తే.. కొత్త హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్లను కలిగి ఉండే ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ (యూరోపియన్ వెర్షన్‌లో), 14 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మందపాటి సైడ్ గార్డ్‌లతో హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది.

ఎక్స్టీరియర్స్
అంతేకాకుండా, ఆకర్షనీయమైన విండో/రూఫ్ లైన్ (యూరోపియన్ వెర్షన్ సన్నటి రియర్ విండో స్పోర్టీయర్ లుక్‌ని కలిగి ఉంటుంది) మరొక ప్రత్యేకత. సరికొత్త హెడ్‌లైట్స్, రియర్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్, రూఫ్ రెయిల్స్ హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నాయి.

కొత్త ప్లాట్‌ఫామ్
హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ పేరులో ఐ10 ఉన్నప్పటికీ, ఈ కొత్త కారును మాత్రం సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు (ఐ10 ప్లాట్‌ఫామ్‌పై కాదు). ఇది ప్రస్తుతం మార్కెట్లోలభిస్తున్న పెట్రోల్ వెర్షన్ ఐ10 కారు కన్నా 100 మి.మీ. ఎక్కువ పొడవును, 70 మి.మీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్సును కలిగి ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్
హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. డీజిల్ వెర్షన్‌లో సరికొత్త 1.1 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు (ఈ ఇంజన్ వివరాలు తెలియాల్సి ఉంది). భారత్‌లో హ్యుందాయ్ నుంచి లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా ఐ10 గ్రాండ్ చవకదిగా ఉండనుంది.

ఫీచర్స్
హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌లో అనేక ఫీచర్లు ఉండనున్నాయి. 1జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రియర్ ఏసి వెంట్స్, ఎయిర్ కండిషన్డ్ గ్లౌ బాక్స్ వంటి ఫీచర్లున్నాయి. అంతేకాకుండా, స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ ఫీచర్లు కూడా ఈ కారు సొంతం.

ఇంటీరియర్స్
ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఐ10 కన్నా మరింత ప్రీమియంగా ఉండనున్నాయి. నాణ్యమైన ప్లాస్టిక్స్, డ్యూయెల్ టోన్ బీజ్ ఇంటీరియర్స్, విశాలమైన రియర్ లెగ్‌రూమ్, విభిన్న డిజైన్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్ వంటి ఇంటీరియర్లు ఉండనున్నాయి.

సేఫ్టీ ఫీచర్స్
హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








