హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విడుదల; ధర రూ.4.29 లక్షలు

By Ravi

మొత్తానికి విడుదలయ్యింది. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (Hyundai Grand i10) నేడు (సెప్టెంబర్ 3, 2013న) భారత మార్కెట్లో విడుదలయ్యింది. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ ఈ కొత్త కారును సరసమైన ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టింది.

పవర్‌పుల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎక్కువ మైలేజీనిచ్చే చిన్న డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లభ్యంకానుంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.4.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కాంపాక్ట్ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో (ఎరా, మాగ్నా, స్పోర్స్, ఆస్టా) లభ్యమవుతుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వేరియంట్ల వారీ ధరలు, ఇంజన్ ఆప్షన్స్, మైలేజ్, ఫీచర్లు తదితర మరిన్ని అదనపు వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

ధరలు వేరియంట్లు

ధరలు వేరియంట్లు

పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు

  1. గ్రాండ్ ఐ10 ఎరా - రూ.4.29 లక్షలు
  2. గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.4.49 లక్షలు
  3. గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 4.88 లక్షలు
  4. గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.5.47 లక్షలు
ధరలు వేరియంట్లు

ధరలు వేరియంట్లు

డీజిల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు

గ్రాండ్ ఐ10 ఎరా - రూ.5.23 లక్షలు

  1. గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.5.43 లక్షలు
  2. గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 5.82 లక్షలు
  3. గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.6.41 లక్షలు
పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ ఇంజన్ మైలేజ్

పెట్రోల్ ఇంజన్ మైలేజ్

పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారు లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ ఇంజన్ మైలేజ్

డీజిల్ ఇంజన్ మైలేజ్

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారు లీటరు డీజిలుకు 24 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

ఐ10, గ్రాండ్ 10 ఎక్స్టీరియర్లను గమనిస్తే, కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో విభిన్నంగా స్టయిల్ చేయబడిన హెక్సాగనల్ ఫ్రంట్ ఎయిర్-ఇన్‌టేక్, పాగ్ ల్యాంప్ హౌసింగ్, హెడ్‌లైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు పైభాగంలో అమర్చిన బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, మందపాటి ప్లాస్టిక్ స్క్రాచ్ గార్డ్స్, రియర్ వైపర్ అండ్ వాషర్ మరియు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇందులో అదనపు ఆకర్షనలు.

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

* రియర్ ఏసి వెంట్స్ (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)

* డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ - విశిష్టమైన 2 టోన్ డిజైన్ (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)

* ఇంటిగ్రేటెడ్ 2-డిన్ ఎమ్‌పి3 ఆడియో సిస్టమ్, 1 జిబి ఇన్‌బిల్ట్ మెమరీతో (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)

* స్మార్ట్ కీ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్

* బ్లూటూత్ కనెక్టివిటీ

* ఫ్రంట్, రియర్ పవర్ అవుట్‌లెట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

* మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ (బ్లూటూత్, ఆడియో, మరియు ట్రిప్ మీటర్ కంట్రోల్స్)

* ఆటో ఫోల్డింగ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్

* రియర్ పార్కింగ్ సెన్సార్స్

* అవుట్ సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్

* రియర్ డిఫాగ్గర్

* డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

* కూల్డ్ గ్లవ్ బాక్స్

* టిల్ట్ స్టీరింగ్

* లెథర్ స్టీరింగ్ వీల్

* ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ (డ్రైవర్ ఆటో డౌన్ ఫంక్షన్‌తో)

* రియర్ స్పాయిలర్

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), సెంట్రల్ లాకింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు లభ్యమవుతుంది.

కొలతలు (ఐ10 కారుతో పోల్చితే)

కొలతలు (ఐ10 కారుతో పోల్చితే)

గ్రాండ్ ఐ10 రెగ్యులర్ వెర్షన్ ఐ10 కన్నా 180 మి.మీ. ఎక్కువ పొడవును, 55 మి.మీ. ఎక్కువ వెడల్పును, 30 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. వీల్ బేస్ కూడా 45 మి.మీ. ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గ్రాండ్ ఐ10 విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, 256 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 3, 2013, 15:46 [IST]
English summary
First revealed to the world a few weeks back, Hyundai Grand i10 is the 2014 model year Hyundai i10 which is being sold in India as a new hatchback, positioned between the i10 and i20. Hyundai today launched the Grand i10 at an event held in Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+