హైదరాబాద్‌లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విడుదల; ధరలు, ఫీచర్లు
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ డీజిల్ కారు 'గ్రాండ్ ఐ10' (Grand i10) మంగళవారం నాడు (సెప్టెంబర్ 10, 2013న) హైదరాబాద్ మార్కెట్లో విడుదలయ్యింది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఇంతవరకు తమకు ఈ సెగ్మెంట్‌లో డీజిల్ వెర్షన్ లేకపోవడం పెద్ద లోటుగా ఉండేదని, గ్రాండ్ ఐ10 విడుదలతో ఆ లోటు తీరుతోందని, ఫలితంగా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తమ మార్కెట్ వాటా మరింతగా పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు.
కొనుగోలుదారులు ప్రధానంగా మైలేజ్, రీసేల్ వాల్యూకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డీజిల్ వెర్షన్ లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజీతో కాంపాక్ట్ హై ఎంట్రీ విభాగంలో నూతన ప్రమాణంగా నిలిచిందని శ్రీవాత్సవ తెలిపారు. భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ కారును తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌లోని హ్యుందాయ్ ఆర్ అండ్ డి విభాగానికి చెందిన 100 మంది ఇంజనీర్లు భాగం పంచుకున్నారని, భవిష్యత్‌లో రాబోయే మోడళ్లకు కూడా ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించనుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధర మరియు ఈ కారుకు సంబంధించిన మరిన్ని ఫీచర్లు, వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు
గ్రాండ్ ఐ10 ఎరా - రూ.4.37 లక్షలు
గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.4.57 లక్షలు
గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 4.97 లక్షలు
గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.5.57 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

డీజిల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు
గ్రాండ్ ఐ10 ఎరా - రూ.5.33 లక్షలు
గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.5.52 లక్షలు
గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 5.92 లక్షలు
గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.6.53 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

90 శాతం లోకలైజేషన్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 తయారీలో 90 శాతం స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను వినియోగించారు. ఫలితంగానే ఈ కారును అత్యంత సరమైన ధరకు ఆఫర్ చేస్తున్నారు.

కాంపిటీషన్
ఈ సెగ్మెంట్లో లభిస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ విడిఐ వేరియంట్‌తో పోల్చుకుంటే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మాగ్నా వేరియంట్లో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయని, అంతేకాకుండా, ఇది స్విఫ్ట్ విడిఐ ధరతో పోల్చుకుంటే రూ.90,000 తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

పెట్రోల్ ఇంజన్
హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ ఇంజన్ మైలేజ్
పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారు లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ ఇంజన్
హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ ఇంజన్ మైలేజ్
డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారు లీటరు డీజిలుకు 24 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)
డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఎక్స్టీరియర్
ఐ10, గ్రాండ్ 10 ఎక్స్టీరియర్లను గమనిస్తే, కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో విభిన్నంగా స్టయిల్ చేయబడిన హెక్సాగనల్ ఫ్రంట్ ఎయిర్-ఇన్‌టేక్, పాగ్ ల్యాంప్ హౌసింగ్, హెడ్‌లైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఎక్స్టీరియర్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు పైభాగంలో అమర్చిన బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, మందపాటి ప్లాస్టిక్ స్క్రాచ్ గార్డ్స్, రియర్ వైపర్ అండ్ వాషర్ మరియు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇందులో అదనపు ఆకర్షనలు.

గ్రాండ్ ఐ10 ఫీచర్ హైలైట్స్
* రియర్ ఏసి వెంట్స్ (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)
* డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ - విశిష్టమైన 2 టోన్ డిజైన్ (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)
* ఇంటిగ్రేటెడ్ 2-డిన్ ఎమ్‌పి3 ఆడియో సిస్టమ్, 1 జిబి ఇన్‌బిల్ట్ మెమరీతో (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)
* స్మార్ట్ కీ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్
* బ్లూటూత్ కనెక్టివిటీ
* ఫ్రంట్, రియర్ పవర్ అవుట్‌లెట్స్

గ్రాండ్ ఐ10 ఫీచర్ హైలైట్స్
* మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ (బ్లూటూత్, ఆడియో, మరియు ట్రిప్ మీటర్ కంట్రోల్స్)
* ఆటో ఫోల్డింగ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్
* రియర్ పార్కింగ్ సెన్సార్స్
* అవుట్ సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్
* రియర్ డిఫాగ్గర్
* డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్

గ్రాండ్ ఐ10 ఫీచర్ హైలైట్స్
* కూల్డ్ గ్లవ్ బాక్స్
* టిల్ట్ స్టీరింగ్
* లెథర్ స్టీరింగ్ వీల్
* ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ (డ్రైవర్ ఆటో డౌన్ ఫంక్షన్‌తో)
* రియర్ స్పాయిలర్

సేఫ్టీ ఫీచర్లు
డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), సెంట్రల్ లాకింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








