హ్యుందాయ్ గ్రాండ్ స్పోర్ట్స్ స్పెషల్ ఎడిషన్ విడుదల

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ మోడ్రన్ హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10' (Hyundai Grand i10)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి నిన్నటితో (సెప్టెంబర్ 3, 2014) సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

'హ్యుందాయ్ గ్రాండ్ స్పోర్ట్స్' (Hyundai Grand SportZ) పేరిట కంపెనీ విడుదల చేసిన ఈ యానివర్స్‌‌రే ఎడిషన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. రెగ్యులర్ వేరియంట్లతో పోల్చుకుంటే, ఇందులో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి.


హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 3, 2013న తమ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను రూ.4.29 లక్షల ప్రారంభ ధరకు మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1.1 లక్షలకు పైగా గ్రాండ్ ఐ10 కార్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ గ్రాండ్ స్పోర్ట్స్ ఎడిషన్‌లో 14 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ వీల్‌పై బ్లూటూత్ అండ్ ఆడియో కంట్రోల్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, రియర్ స్పాయిలర్, బ్లాక్ బి-పిల్లర్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, స్పెషల్ ఎడిషన్ డెకాల్స్, బ్లాక్ అండ్ రెడ్ ఇంటీరియర్ థీమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. దీని ధరలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఎడిషన్ ధర - రూ.5,11,550
డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఎడిషన్ ధర - రూ.5,98,554
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Hyundai Grand SportZ Edition Launched

హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిలుకు 24 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 4, 2014, 10:04 [IST]
English summary
Hyundai Motor India Limited (HMIL), the country’s largest exporter and the second-largest car manufacturer; celebrating the first anniversary of Grand i10, today introduced its ‘SportZ Edition’. Launched in September 2013, Grand has over 1.1 lakh happy owners in India and has won the prestigious Indian Car of the Year (ICOTY 2014) and numerous awards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+