హ్యుందాయ్ ఐ10 గ్రాండ్: వేరియంట్స్, ఇంజన్స్ & మైలేజ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా అభివృద్ధి తొలి కాంపాక్ట్ డీజిల్ 'గ్రాండ్ ఐ10' మరికొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల కానున్న సంగతి తెలిసినదే. తాజాగా గ్రాండ్ ఐ10కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే డీలర్ల వద్దకు చేరిపోయింది. ఈ నేపథ్యంలో, గ్రాండ్ ఐ10 వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్స్, మైలేజ్ వంటి అంశాలకు సంబంధించిన సమాచారం వెల్లడైంది. హ్యుందాయ్ డీలర్లు ఆల్రెడీ గ్రాండ్ ఐ10 కోసం ముందస్తు బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించేశారు.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, డీలర్లు తొలుత ఐ10 పై బుకింగ్‌లను తీసుకొని ఈ కారు విడుదలైన తర్వాత వాటిని గ్రాండ్ ఐ10 పేరుకు మార్చనున్నట్లు తెలుస్తోంది. మరి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10కు సంబంధించి ఆ ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే, ఈ ఫొటోఫీచర్‌ను పరిశీలించండి.

ధర, వేరియంట్స్, ఇంజన్స్

ధర, వేరియంట్స్, ఇంజన్స్

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఐ10, ఐ20 మోడళ్ల మధ్యలో ప్రవేశపెట్టనున్న ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్ ధర ఈ శ్రేణిలోని రిట్జ్, వ్యాగన్ఆర్, మైక్రా/పల్స్ ధరల రేంజ్‌‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఎరా, మాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా వేరియంట్లలో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ వెర్షన్ అదే పాత 1.2 లీటర్ కప్పా2 ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ వెర్షన్‌లో మాత్రం సరికొత్త 1.1 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఇంజన్స్, పెర్ఫామెన్స్

ఇంజన్స్, పెర్ఫామెన్స్

పెట్రోల్ వెర్షన్‌లో పాత ఇంజన్‌నే ఉపయోగించినప్పటికీ, దీని పవర్‌ను రీట్యూన్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా పెట్రోల్ ఇంజన్ 82 హెచ్‌పిల శక్తిని, 114 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. అలాగే డీజిల్ వెర్షన్ 70 పిఎస్‌ల శక్తిని, 156 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

ట్రాన్సిమిషన్స్, మైలేజ్

ట్రాన్సిమిషన్స్, మైలేజ్

పెట్రోల్ వెర్షన్ ఐ10 గ్రాండ్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 18.9 కి.మీ మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేయనుంది. డీజిల్ వెర్షన్ లీటరుకు 24 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని సమాచారం.

మరింత సమాచారం

మరింత సమాచారం

డీలర్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కథనం ప్రచురించడం జరిగింది. హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ 3, 2013 వరకూ వేచి ఉండాల్సింది. తాజా అప్‌డేట్‌ల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 31, 2013, 10:45 [IST]
English summary
Launch of Hyundai i10 Grand is set to take place on September 3rd. Meanwhile, the company has not come out with any official details of its own. But since dealers already seem to have received demo models details of the vehicle have started trickling out.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+