హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ విడుదల: ధర రూ.6.38 లక్షలు
గతకొద్ది కాలంగా కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన 'హ్యుందాయ్ ఐ20 యాక్టివ్' (Hyundai i20 Active) నేడు (మార్చ్ 17, 2015) భారత మార్కెట్లో విడుదలైంది. కేవలం రూ.6.38 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేసింది.
హ్యుందాయ్ అందిస్తున్న ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ వేరియంట్లు ధరలు:
పెట్రోల్ వెర్షన్ ధరలు:
- ఐ20 యాక్టివ్ 1.2 - రూ.6.38 లక్షలు
- ఐ20 యాక్టివ్ 1.2 ఎస్ - రూ.7.10 లక్షలు
పెట్రోల్ వెర్షన్ ధరలు:
- ఐ20 యాక్టివ్ 1.4 - రూ.7.63 లక్షలు
- ఐ20 యాక్టివ్ 1.4 ఎస్ - రూ.8.34 లక్షలు
- ఐ20 యాక్టివ్ 1.4 ఎస్ఎక్స్ - రూ.8.89 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ డిటేల్స్:
- పెట్రోల్ : 1197సీసీ, 82 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ చార్క్, 5-స్పీడ్ మ్యాన్యువల్
- డీజిల్ : 1396సీసీ, 89 బిహెచ్‌పి పవర్, 220 ఎన్ఎమ్ చార్క్, 6-స్పీడ్ మ్యాన్యువల్

- 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్
- డ్యూయెల్-టోన్ ఇంటీరియర్స్ (ఆరెంజ్ అండ్ బ్లాక్, ఆక్వా బ్లూ అండ్ బ్లాక్)
- 190 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ (ఎలైట్ ఐ20 కన్నా 20 మి.మీ. అధికం)
- అల్యూమినియం కోటెడ్ పెడల్స్
- ఇంటీరియర్ థీమ్‌తో మ్యాచ్ అయ్యే గేర్-నాబ్
- బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్
- రూఫ్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్



Click it and Unblock the Notifications








