విడుదలకు ముందే హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ఫొటోలు లీక్!
హ్యుందాయ్ యాక్టివ్ ఐ20 క్రాసోవర్ మోడల్ గురించి గత కొద్ది రోజులగా మార్కెట్లో మంచి బజ్ నెలకొన్న సంగతి తెలిసినదే. హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20ని ఆధారంగా చేసుకొని 'ఐ20 యాక్టివ్' (i20 Active) అనే క్రాసోవర్ మోడల్‌ను డిజైన్ చేశారు. ఈ మోడల్‌ను మార్చ్ 18వ తేదీన ముంబై మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ మేరకు హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌కి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫొటోలు విడుదలయ్యాయి. ఐ20 యాక్టివ్ క్రాసోవర్ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు. ఈ క్రాసవర్ మోడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. సిటీ డ్రైవింగ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కి అనుగుణంగా ఈ కారును తీర్చిదిద్దారు.
హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ అఫీషియల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో కేవలం కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎలైట్ ఐ20లో ఆఫర్ చేస్తున్న ఇంజన్లనే ఇందులోను ఉపయోగించనున్నారు.

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1197సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 హెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 18.6 కెఎంపిఎల్.

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1396సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 22.54 కెఎంపిఎల్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ఇంటీరియర్లను రెడ్ అండ్ బ్లాక్ థీమ్‌తో డిజైన్ చేశారు. ఈ కొత్త ఇంటీరియర్స్ కారు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








