హ్యుందాయ్ ఐ20 కూపే ధర వెల్లడి; భారత్‌కు వస్తుందా?
కొరియన్ కార్ హ్యుందాయ్, ఇటీవల విడుదల చేసిన నెక్స్ట్ జనరేషన్ ఐ20 మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ 3-డోర్ కూపే వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ యూకే మార్కెట్ కోసం ఈ మోడల్ ధరలను వెల్లడి చేసింది.
యూకే మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కూపే ప్రారంభ ధర 12,725 పౌండ్లు (సుమారు రూ.12.21 లక్షలు). అక్కడి మార్కెట్లో బేస్ వేరియంట్ మోడల్‌లోనే 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్ విత్ స్పీడ్ లిమిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ స్పాయిలర్ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.
హ్యుందాయ్ ఐ20 కూపే కారుకి సంబంధించి మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి..!

హ్యుందాయ్ ఐ20 కూపేని జర్మనీలోని రస్సెల్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ యూరోపియన్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు.

రెగ్యులర్ ఫైవ్-డోర్ వెర్షన్ ఐ20 మోడల్‌ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్త త్రీ-డోర్ వెర్షన్ ఐ20ని డిజైన్ చేశారు. అయితే, త్రీ-డోర్ నిర్మాణం కోసం అన్ని పిల్లర్లను ఆల్టర్ చేశారు. ఫలితంగా దీని రూఫ్‌లైన్ ఫైవ్-డోర్ వెర్షన్ కన్నా దాదాపు 25 మి.మీ. తక్కువగా ఉంటుంది.

అయితే, ఈ మార్పు వలన త్రీ-డోర్ వెర్షన్ ఐ20లో ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ఫైవ్-డోర్ వెర్షన్ ఐ20తో పోల్చుకుంటే త్రీ-డోర్ వెర్షన్ ఐ20 బూట్ స్పేస్ 10 లీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీని మొత్తం బూట్ స్పేస్ 336 లీటర్లు.

హ్యుందాయ్ ఐ20 కూపే (3-డోర్ వెర్షన్) పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ ఇంజన్లు యూరో-6 నిబంధనలను పాటించనున్నాయి.

యూకే వెర్షన్ హ్యుందాయ్ ఐ20 కూపే 84 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో ఐ20 కూపేలో 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

యూకే వెర్షన్ హ్యుందాయ్ ఐ20 కూపే మొత్తం ఆరు వేరియంట్లలో (3 పెట్రోల్, 3 డీజిల్) లభ్యం కానుంది.

మరి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తుందంటారా?


Click it and Unblock the Notifications








