మార్చ్ 9న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 క్రాస్ విడుదల
హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ క్రాసోవర్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.
కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, కొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 క్రాస్ మార్చ్ 9, 2015వ తేదీన మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. దేశీయ విపణిలో ఈ క్రాసోవర్ ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా.

డిజైన్ విషయానికి వస్తే.. ఇప్పటికే అత్యంత సుందరంగా ఉన్న ఎలైట్ ఐ20, క్రాసోవర్ గెటప్‌లో మరింత స్పోర్టీగా కనిపించే అవకాశం ఉంది. ఇంటీరియర్స్‌లో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
ఇకపోతే, ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో ఆఫర్ చేస్తున్న 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ క్రాసోవర్‌లోను ఉపయోగించనున్నారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ కోఆర్డినేటర్ యంగ్ జిన్ ఆన్ కూడా విషయాన్ని ఖరారు చేశారు. 2015లో రెండు కొత్త కార్లను విడుదల చేస్తామని, వీటిలో ముందుగా ఎలైట్ ఐ20 క్రాసోవర్‌ను మార్చ్ నెలలో విడుదల చేస్తామని, ఆ తర్వాత ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొస్తామని చెప్పారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








