బ్రెజిల్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 సెడాన్ విడుదల!

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఐ20' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ఎంట్రీ లెవల్ సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇటీవలే బ్రెజిల్ వెర్షన్ ఐ20 సెడాన్‌ను ఆవిష్కరించిన హ్యుందాయ్, ఇప్పుడు వాణిజ్య పరంగా ఈ మోడల్‌ను అక్కడి మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రెజిల్ మార్కెట్లో ఈ కొత్త సెడాన్‌ను 'హ్యుందాయ్ హెచ్20ఎస్' పేరుతో కంపెనీ విక్రయిస్తోంది.

ఇందులో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను 'హ్యుందాయ్ హెచ్20' అనే పేరుతో ఇప్పటికే బ్రెజిల్ మార్కెట్లో హ్యుందాయ్ మార్కెట్ చేస్తోంది. భారత మార్కెట్లో అమ్ముడవుతున్న సరికొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌కు బ్రెజిల్ మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ హెచ్‌20 హ్యాచ్‌బ్యాక్‌కు అనేక పోలికలు ఉన్నాయి. కాబట్టి, ఇదే కోవలో హ్యుందాయ్ భారత్‌లో విడుదల కానున్న ఐ20 సెడాన్‌కు ఈ హెచ్‌బి20ఎస్ సెడాన్‌కు కూడా అనేక పోలికలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ-లెవల్ సెడాన్ 'యాక్సెంట్' స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ సరికొత్త ఐ20 సెడాన్‌ను ప్రవేశపెట్టనుంది. కంపెనీ గడచిన సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన ఐ-జెన్ ఐ20 ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేయనుంది. ఇంజన్ పరంగా కూడా ఇందులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో లభిస్తున్న దాదాపు అన్ని ఫీచర్లు ఐ20 సెడాన్‌లోను లభించే ఆస్కారం ఉంది.

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్‌ను హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఎంట్రీ లెవర్ వేరియంట్లోనే పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనర్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, పవర్ విండోస్, బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీ, రేడియో, ఎమ్‌పి3 సపోర్టుతో కూడిన ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. అక్కడి మార్కెట్లో దీని ధర 39,495 రియల్స్ (మన దేశ కరెన్సీలో సుమారు రూ.10.95 లక్షలు).

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ సెడాన్

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2013, 15:47 [IST]
English summary
India's second largest car maker Hyundai Motors India is planning bring an entry level sedan based its premium hatchback i20. This all new entry level sedan might the replaced version of the existing Hyundai Accent. Have a look at the Brazilian version of i20 sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+