ఐఎఫ్ డిజైన్ అవార్డ్ 2015 దక్కించుకున్న హ్యుందాయ్ ఐ20

By Ravi

హ్యుందాయ్ అందిస్తున్న న్యూ జనరేషన్ 'ఎలైట్ ఐ20' ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది. అందమైన డిజైన్‌కు గాను ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 అంతర్జాతీ 'ఐఎఫ్ డిజైన్ అవార్డ్ 2015'ను దక్కించుకుంది.

ఐ20 కారును హ్యుందాయ్ నుంచి అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద డిజైన్ చేశారు.

Hyundai i20 Wins iF Design Award 2015

ఇటీవలే భారత్‌లో కూడా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్ ప్రతిష్టాత్మక 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2015' (ICOTY)ను గెలుచుకున్న సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఎలైట్ ఐ20 పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Hyundai i20 iF Design Award 2015

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 3, 2015, 12:45 [IST]
English summary
Hyundai Motor India Ltd, the country’s second largest car manufacturer and the largest passenger car exporter has won the most coveted Indian Car of the Year 2015 (ICOTY) award for the Elite i20.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+