హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎల్‌పిజి వేరియంట్ విడుదల

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లో మరో కొత్త ఫ్యూయెల్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ఫ్యూయెల్ ఆప్షన్లలో మాత్రమే లభ్యమవుతూ ఉండేది. కాగా.. కంపెనీ ఇందులో తాజాగా ఎల్‌‍పిజి ఫ్యూయెల్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎల్‌పిజి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో కేవలం మాగ్నా వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎల్‌పిజి కిట్ అమర్చిన గ్రాండ్ ఐ10 ధరను రూ.4.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించాని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎల్‌పిజి వెర్షన్ మంచి సక్సెస్ సాధించగలదని కంపెనీ భావిస్తోంది.


ఎల్‌పిజి కిట్ ఫిట్టెడ్ గ్రాండ్ ఐ10 కారులో 998సీసీ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ యూరో 5 నిబంధనలు పాటించేందుకు సిద్ధంగా ఉంది. డ్యూయెల్ విటివిటి టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఇంజన్ మెరుగైన మైలేజీని, పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్చ చేస్తుంది. ఎల్‌పిజి వేరియంట్ కోసం ఈ ఇంజన్‌ను గరిష్టంగా 68 బిహెచ్‌పిల శక్తిని, 94 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేశారు.

ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎల్‌‌పిజి గరిష్టంగా 20.3 కి.మీ. మైలేజీనిస్తుంది.

Hyundai India Launch Grand i10 With LPG

గ్రాండ్ ఐ10 ఎల్‌పిజి వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్, ఫాగ్ ల్యాంప్స్, పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడుకున్న ఆడియో సిస్టమ్ కూడా లభిస్తుంది.

Article Published On: Friday, July 4, 2014, 11:12 [IST]
English summary
Hyundai have launched its popular Grand i10 with a factory fitted LPG kit. The South Korean manufacturer will offer the LPG trim only in its Magna trim. The LPG fitted Grand i10 will cost INR 4,96,034 ex-showroom, Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+