1.0 లీటర్ ఇంజన్‌తో 'హ్యుందాయ్ ఇయాన్' విడుదల
హ్యుందాయ్ కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న చిన్న కారు 'ఇయాన్'లో 1.0 లీటర్ (1000సీసీ) కప్పా పెట్రోల్ ఇంజన్‌తో కూడిన మరో కొత్త పవర్‌ఫుల్ వేరియంట్‌ను కంపెనీ నేడు (ఏప్రిల్ 06, 2014) మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 0.8 లీటర్ (800సీసీ) పెట్రోల్ ఇంజన్‌తో కూడిన వేరియంట్లతో పాటుగానే ఈ కొత్త 1.0 లీటర్ కప్పా వేరియంట్ కూడా లభ్యం కానుంది.
యూరో 5 నిబంధనలు పాటించే ఈ కొత్త 1.0 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ అధునాతన డ్యూయెల్ విటివిటి టెక్నాలజీతో అనుసంధానం చేయబడి ఉండి, అధిక పెర్ఫార్మెన్స్‌ను, మెరుగైన మైలేజీని మరియు తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 69 పిఎస్‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఇంజన్ లీటరుకు గరిష్టంగా 20.3 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. (యూరోపియన్ మార్కెట్లలో విక్రయిస్తున్న కొత్తయ హ్యుందాయ్ ఐ10 కారులో కూడా ఇదే 1.0 లీటర్ (1000సీసీ), 3-సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు). అయితే, ఈ 1.0 లీటర్ వేరియంట్ కేవలం మిడ్-స్పెక్ మాగ్నా ప్లస్ వేరియంట్లో మాత్రం అందుబాటులో ఉండనుంది.
కొత్త ఇయాన్ మాగ్నా ప్లస్ 1.0 వేరియంట్‌లో ఇంజన్ మార్పు తప్ప డిజైన్, స్టయిలింగ్‌లో ఎలాంటి మార్పులు లేవు. మార్కెట్లో దీని ధర రూ.3.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.ఈ వేరియంట్‌లో ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, కీలెస్ ఎంట్రీ, 13 ఇంచ్ స్టీల్ వీల్స్, ఫుల్ వీల్ కవర్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. కాకపోతే ఇందులో మ్యూజిక్ సిస్టమ్ మాత్రం అందుబాటులో లేదు.


Click it and Unblock the Notifications








