సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో విడుదల; ధర రూ.3.81 లక్షలు
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న శాంత్రో కారులో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‍ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు హ్యుందాయ్ కేవలం రూ.3.81 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే శాంత్రో సెలబ్రేషన్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
దక్షిణ కొరియాకు చెందిన ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లోకి ప్రవేశించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సెలబ్రేషన్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ తొలిసారిగా తమ శాంత్రో కారును 1998లో భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతదేశంలో లభ్యమవుతున్న అత్యంత పాపులర్, రిలయబల్ కార్లలో హ్యుందాయ్ శాంత్రో కూడా ఒకటి.
రెగ్యులర్ వెర్షన్ హ్యుందాయ్ శాంత్రోతో పోల్చుకుంటే, ఈ సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రోలో మరిన్ని అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. పెట్రోల్, ఎల్‌పిజి, సిఎన్‌జి వెర్షన్లలో లభ్యం కానున్న సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో మూడు రంగులలో (కోరల్ వైట్, స్లీక్ సిల్వర్, మష్రూమ్) లభ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్ కేంద్రాలలో దీనిని విక్రయించనున్నారు.
సెలబ్రేషన్ ఎడిషన్ హ్యుందాయ్ శాంత్రో కారులో లభ్యం కానున్న ఫీచర్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్
సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో జింగ్ కేవలం జిఎల్ ప్లస్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇందులో స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తుంది. హ్యుందాయ్ కేవలం రూ.3.81 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే శాంత్రో సెలబ్రేషన్ ఎడిషన్‌ను విక్రయిస్తోంది.

రియర్ క్రోమ్ గార్నిష్
వెనుక వైపు మరింత ప్రీమియం లుక్ ఇచ్చేందుకు గాను నెంబర్ ప్లేటుకు పైభాగంలో క్రోమ్ గార్నిష్ చేశారు. మెరుస్తూ ఉండే ఓ క్రోమ్ బార్‌ను వెనుక డోరుకు అమర్చారు.

రియర్ పార్కింగ్ సెన్సార్స్
సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పార్కింగ్ కోసం ఈ సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో జింగ్ కారులో పార్కింగ్ సెన్సార్లను ఆఫర్ చేస్తున్నారు.

ఎల్ఈడి డిస్‌ప్లే
పార్కింగ్ సెన్సార్ల వచ్చే సంకేతాలను కారు లోపల ఫ్రంట్ విండ్‌షీల్డ్‌కు పైభాగంలో అమర్చిన ఎల్ఈడి డిస్‌ప్లేలో చూడొచ్చు.

మ్యాన్యువల్ రియర్ కర్టెన్ (సన్‌బ్లైండ్)
ఎండ వేడిమిని తట్టుకునేందుకు సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో కారులో వెనుక వైపు మ్యాన్యువల్ రియర్ కర్టెన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

బ్లాపంక్ట్ స్టీరియో సిస్టమ్
సంగీత ప్రియుల కోసం హ్యుందాయ్ శాంత్రో సెలబ్రేషన్ ఎడిషన్‌లో బ్లాపంక్ట్ స్టీరియో సిస్టమ్‌తో పాటు స్పీకర్లను కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








