సైలెంట్‌గా హ్యుందాయ్ వెర్నా జిఎల్ వేరియంట్ విడుదల

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న వెర్నా సెడాన్‌లో ఇటీవలే 'సిఎక్స్' వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా హ్యుందాయ్ తమ వెర్నా సెడాన్‌లో మరో కొత్త వేరియంట్‌ను సైలెంట్‌గా విడుదల చేసింది.

ఈ కొత్త వేరియంట్ పేరు 'వెర్నా జిఎల్'. సిఎక్స్ వేరియంట్ మాదిరిగానే ఇది కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. హ్యుందాయ్ వెర్నా జిఎల్ వేరియంట్ ఒక బేస్ వేరియంట్. ఇది 1.4 లీటర్ విటివిటి పెట్రోల్ ఇంజన్‌ను, 1.4 లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:


* హ్యుందాయ్ వెర్నా జిఎల్ (పెట్రోల్) - రూ.7.17 లక్షలు
* హ్యుందాయ్ వెర్నా జిఎల్ (డీజిల్) - రూ.8.35 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా జిఎల్ వేరియంట్లో ఉపయోగించిన 1.4 లీటర్ విటివిటి ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పిల శక్తిని, 138 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Hyundai Verna GL Variant Launched In India

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా జిఎల్ వేరియంట్లో ఉపయోగించిన 1.4 లీటర్ సిఆర్‌డిఐ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 224 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ధర తగ్గించిన కారణంగా హ్యుందాయ్ వెర్నా జిఎల్ వేరియంట్లో.. కీలెస్ ఎంట్రీ, 2-డిన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లను తొలగించారు. ఇదివరకి ఈఎక్స్ వేరియంట్ స్థానాన్ని ఈ కొత్త జిఎల్ వేరియంట్ భర్తీ చేయనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 22, 2014, 18:25 [IST]
English summary
Hyundai recently launched their new sedan the Xcent. They now have secretly launched a GL variant of their Verna both in petrol and diesel options.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+