హ్యుందాయ్ ఎన్ పెర్ఫామెన్స్ డివిజన్ ప్రకటన; ఐ20 డబ్ల్యూఆర్‌సి విడుదల
కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ ఇప్పుడు తమ దృష్టిని బోరింగ్ ప్యాసింజర్ కార్ల నుంచి హైపెర్ఫామెన్స్ కార్ల వైపుకు మళ్లించనుంది. ప్రత్యేకించి మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాల్లో పాల్గొని, విజయం సాధించే దిశగా ఓ కొత్త పెర్ఫామెన్స్ డివిజన్‌ను హ్యుందాయ్ ప్రారంభించనుంది. ఈ పెర్ఫామెన్స్ డివిజన్‌కు 'హ్యుందాయ్ ఎన్' (Hyundai N) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
హ్యుందాయ్ ఎన్ పెర్ఫామెన్స్ డివిజన్ మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, హైపెర్ఫామెన్స్ కార్ల అభివృద్ధికి కూడా కృషి చేయనుంది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ అభివృద్ధి రేస్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి (వరల్డ్ ర్యాలీ కార్)ను కంపెనీ ఆవిష్కరించింది. ఇది రెగ్యులర్ ఐ20 కన్నా అత్యంత శక్తివంతమైన ఐ20 కారు.
హ్యుందాయ్ కేవలం ఇలా రేస్ స్పెసిఫిక్ హై పెర్ఫామెన్స్ కార్లనే కాకుండా, రోడ్ లీగల్ పెర్ఫామెన్స్ కార్లను భవిష్యత్తులో తయారు చేయనుంది. హ్యుందాయ్ తమ పెర్ఫామెన్స్ బ్రాండ్ 'ఎన్'ను ఆవిష్కరించిన సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం రండి..!

హ్యుందాయ్‌కు ఇప్పటివరకు ఎలాంటి మోటార్‌స్పోర్ట్ విభాగం కానీ లేగా పెర్ఫామెన్స్ డివిజన్ కానీ లేదు. ఇదే మొదటి డబ్ల్యూఆర్‌సి టీమ్ కావటం విశేషం. ఈ టీమ్ పేరు 'హ్యుందాయ్ షెల్ వరల్డ్ ర్యాలీ టీమ్', ఇందులో షెల్ టైటిల్ పార్ట్‌నర్.

హ్యుందాయ్ తమ తొలి డబ్ల్యూఆర్‌సి ప్రయత్నంలో భాగంగా, కొత్తగా మోడిఫై చేసిన ఐ20 డబ్ల్యూఆర్‌సి రేస్ కారుతో ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతుంది. మేడ్ ఇన్ ఇండియా ఐ20 కారును జర్మనీలో అల్జెనావ్‌లో ఉన్న మోటార్‌స్పోర్ట్ విభాగంలో రేసింగ్ కారుగా మార్చారు.

ఈ 'హ్యుందాయ్ షెల్ వరల్డ్ ర్యాలీ టీమ్' వచ్చే ఏడాది జరగనున్న 2014 ఎఫ్ఐఏ వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతుంది. ఈ రేస్ కార్యక్రమం మోంటా కార్లలో జరగనుంది.

ఈ టీమ్ రేస్ ప్రయత్నాలకు ప్రముఖ రేస్ డ్రైవర్ డ్యాని సోర్డో సారధ్యం వహించనున్నాడు. ఇతనికి భాగస్వామిగా తీరే నియూవిల్ ఉంటాడు. అలాగే రెండవ కారు కోసం జుహో హనీన్, క్రిస్ అట్కిన్సన్‌లు డ్రైవర్లుగా ఉంటారు.

తమ కొత్త డబ్ల్యూఆర్‌సి టీమ్ కోసం ఎంతగానో శ్రమించామని, ఒక్క ఏడాది కన్నా తక్కువ సమయంలో తాము సరికొత్త డబ్ల్యూఆర్ స్పెసిఫిక్ రేస్ కారును తయారు చేసి, విజవంతంగా టెస్టింగ్ కూడా చేశామని హ్యుందాయ్ మోటార్‌స్పోర్ట్ టీమ్ ప్రిన్సిపాల్ మైఖేల్ నందన్ వెల్లడించారు.

హ్యుందాయ్ తమ పెర్ఫామెన్స్ డివిజన్‌లో ఐ20 డబ్ల్యూఆర్‌సి రేస్ కార్లను తయారు చేస్తుంది. ఈ డివిజన్‌కు కంపెనీ సింపుల్ 'ఎన్' అనే పేరును పెట్టింది. ఇందుకు ఓ కారణంగా కూడా ఉంది.

ఎన్ అంటే నామ్‌యాంగ్ అని అర్థం. దక్షిణ కొరియాలో ఉన్న హ్యుందాయ్ యొక్క ఆర్ అండ్ డి కేంద్రం పేరు ఇది. అందుకే, తమ డివిజన్‌కు ఎన్ అనే పేరును పెట్టడం జరిగింది. ఈ డివిజన్ క్రింద కేవలం రేస్ కార్లను మాత్రమే కాకుండా హై పెర్ఫామెన్స్ రోడ్ కార్లను కూడా తయారు చేయనున్నారు.

హ్యుందాయ్ ఎన్ అనేది ప్రస్తుతం తాము ఉపయోగించనున్న ఐ20 డబ్ల్యూఆర్‌సి కారులోను అలాగే భవిష్యత్తులో తాము తీసుకున్న హైపెర్ఫామెన్స్ రోడ్ కార్లలోను హ్యుందాయ్ ఆఫర్ చేయనున్న హై పెర్ఫామెన్స్ టెక్నాలజీకి ప్రతీక నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

ఇతర కార్ కంపెనీలకు మోటార్‌స్పోర్ట్ డివిజన్ ఉన్నట్లుగానే, ఇకపై హ్యుందాయ్‌కు కూడా ఓ మోటార్‌స్పోర్ట్ డివిజన్ ఉండనుంది. భవిష్యత్తులో హ్యుందాయ్ మరిన్ని మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాలలో పాల్గొంటూ, అనేక కొత్త రేస్ కార్లను మనకు పరిచయం చేయనుంది.


Click it and Unblock the Notifications








