స్టాప్ ల్యాంప్ స్విచ్ రీప్లేస్ కోసం హ్యుందాయ్ శాంటాఫే రీకాల్
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయించిన శాంటాఫే ఎస్‌యూవీలో 'స్టాప్ ల్యాంప్ స్విచ్'ను రీప్లేస్ చేసేందుకు గాను వెనక్కి పిలిపిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2011 మోడల్ సంవత్సరానికి చెందిన హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీలు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 2437 శాంటాఫే ఎస్‌యూవీలను రీకాల్ చేసింది. ఇవన్నీ 2011 మోడల్ సంవత్సరానికి చెందినవి (జూన్ 26, 2011 నుంచి సెప్టెంబర్ 26, 2013 మధ్య కాలంలో తయారైనవి). ఈ రీకాల్‌కు వర్తించే వాహనాల్లో స్టాప్ ల్యాంప్ స్విచ్‌ను కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేయనుంది.
రీకాల్ వర్తించే శాంటాఫే ఓనర్లను గుర్తించి, హ్యుందాయ్ వారికి ప్రత్యేకంగా సమాచారం అందించనుంది. వినియోగారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా, ఈ వాలంటరీ రీకాల్ చేస్తున్నామని హ్యుందాయ్ తెలిపింది. రీకాల్ క్రిందకు వచ్చే కార్లను హ్యుందాయ్ అధీకృత డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్ల వద్దకు తీసుకువచ్చి ఈ స్విచ్‌ను ఉచితంగా రీప్లేస్ చేయించుకోవచ్చు.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్నది మూడవ తరానికి చెందిన శాంటాఫే. ఇందులో శక్తివంతమైన 2.2 లీటర్ విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బో) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని, 44.55 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇండన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
ఎక్కువ మైలేజ్, తక్కువ కర్బణ వ్యర్థాలను విడుదల చేసేలా ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేశారు. ఇది ఈ సెగ్మెంట్లోని నిస్సాన్ ఎక్స్-ట్రైల్, మారుతి సుజకి గ్రాండ్ విటారా, షెవర్లే కాప్టివా, టొయోటా ఫార్చ్యూనర్, హోండా సిఆర్-వి వంటి మోడళ్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








