సరికొత్త 2015 హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

By Ravi

సౌత్ కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న టక్సన్ ఎస్‌యూవీలో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. వచ్చే నెలలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో సరికొత్త 2015 హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచనున్నారు.

హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్స్‌తో ఇది సరికొత్త స్టయిలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇంటీరియర్లను కూడా విలాసవంతంగా తీర్చిదిద్దారు. ఈ కొత్త టక్సన్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు.

సరికొత్త హ్యుందాయ్ టక్సన్‌లో 513 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకా ఇందులో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్స్ సిస్టమ్, రియర్ ట్రాఫిక్ క్రాస్ అలెర్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్, స్పీడ్ లిమిట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, యాక్టివ్ బానెట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ టక్సన్ ఇంజన్ ఆప్షన్లను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

1.6 పెట్రోల్ - 135 పిఎస్

1.6 పెట్రోల్ - 135 పిఎస్

కొత్త హ్యుందాయ్ టక్సన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ జిడిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 135 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

1.6 పెట్రోల్ - 176 పిఎస్

1.6 పెట్రోల్ - 176 పిఎస్

కొత్త హ్యుందాయ్ టక్సన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 176 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

1.7 డీజిల్ - 115 పిఎస్

1.7 డీజిల్ - 115 పిఎస్

కొత్త హ్యుందాయ్ టక్సన్‌లో ఉపయోగించిన 1.7 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

2.0 డీజిల్ - 136 పిఎస్

2.0 డీజిల్ - 136 పిఎస్

కొత్త హ్యుందాయ్ టక్సన్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ స్డాండర్డ్ పవర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 136 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

2.0 డీజిల్ - 184 పిఎస్

2.0 డీజిల్ - 184 పిఎస్

కొత్త హ్యుందాయ్ టక్సన్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ హై పవర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 184 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 19, 2015, 11:21 [IST]
English summary
With its worldwide public debut just weeks away at the 2015 Geneva Motor Show, the All-New Hyundai Tucson is set to redefine the Hyundai brand’s C-SUV offering – featuring the highest levels of design, quality and technology which are poised to lead the segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+