ఆటో ఎక్స్‌పో 2014: అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ శాంటాఫే విడుదల
గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్ వద్ద జరుగుతున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ తమ సరికొత్త శాంటాఫే ఎస్‌యూవీని విడుదల చేసింది. మునపటి వెర్షన్ శాంటాఫే మోడల్‌ను రీప్లేస్ చేస్తూ, పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌ను తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
భారత మార్కెట్లో మూడవ తరానికి చెందిన ఈ కొత్త శాంటాఫే ధరను రూ.26.30 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త హ్యుందాయ్ శాంటాఫే శక్తివంతమైన 2.2 లీటర్ విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బో) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని, 44.55 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ డీజిల్ ఇండన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ కర్బణ వ్యర్థాలను విడుదల చేసేలా ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేశారు. ఇది ఈ సెగ్మెంట్లోని నిస్సాన్ ఎక్స్-ట్రైల్, మారుతి సుజకి గ్రాండ్ విటారా, షెవర్లే కాప్టివా, టొయోటా ఫార్చ్యూనర్, హోండా సిఆర్-వి వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇదివరకటి తరం శాంటాఫేతో పోల్చుకుంటే, ఈ నెక్స్ట్ జనరేషన్ 2014 శాంటాఫే ఎస్‌యూవీ పొడువును 40 మి.మీ. మేర మరిు వెడల్పును 5 మి.మీ. మేర పెంచారు. అయితే దీని రూఫ్‌లైన్‌ను మాత్రం 45 మి.మీ. మేర తగ్గించారు. కాగా.. వీల్‌బేస్‌ను మాత్రం యధావిధిగా 2700 మి.మీ. గానే ఉంచారు.

ఈ కొలతలను బట్టి చూస్తుంటే, కొత్త హ్యుందాయ్ శాంటాఫే మునుపటి వెర్షన్ కన్నా మరింత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేయనుందని తెలుస్తోంది. కొత్త శాంటాఫేలో 7-సీటర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.

పాత మోడల్ కన్నా కొత్త శాంటాఫే మోడల్ మరింత మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. హ్యుందాయ్ తమ కొత్త శాంటాఫే ఎస్‌యూవీని స్థానికంగా భారతదేశంలోనే అసెబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. చెన్నైలో ఉన్న కంపెనీ ప్లాంటులో ఈ ఎస్‌యూవీని తయారు చేసే అవకాశం ఉంది.

కొత్త శాంటాఫేలో రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్లతో పాటుగా, మెరుగైన నాణ్యత, కొత్త ఎక్విప్‌మెటంట్స్ మరియు సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ శాంటాఫే రియర్ డిజైన్

అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ శాంటాఫే రియర్ సీట్

కొత్త హ్యుందాయ్ శాంటాఫే స్టీరింగ్ కాలమ్


Click it and Unblock the Notifications








