భారత మార్కెట్‌‌కి గుడ్‍‌బై చెప్పనున్న హ్యుందాయ్ శాంత్రో

By Ravi

సుమారు 15 ఏళ్ల పాటు భారత చిన్న కార్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న హ్యుందాయ్ శాంత్రో, ఇక మార్కెట్ నుంచి కనుమరుగు కానుంది. కొరియన్ కార్ కంపెనీ అయిన హ్యుందాయ్, భారత మార్కెట్లో మంచి పట్టు సాధించడానికి శాంత్రోనే కారణం చెప్పాలి.

హ్యుందాయ్ తొలిసారిగా తమ శాంత్రో కారును 1998లో భారత్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో 1.36 మిలియన్ యూనిట్లకు పైగా శాంత్రో కార్లను విక్రయించగా 5.35 లక్షల శాంత్రో కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

శాంత్రో ఇప్పటికీ హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో ఒకటిగా ఉంది. హ్యుందాయ్ శాంత్రో ఉత్పత్తిని నిలిపివేయటం వలన కంపెనీ విక్రయిస్తున్న ఇతర మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

Santro

మారుతి 800, మారుతి జెన్ వంటి కార్లు భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఓ కొత్త విప్లవాన్ని తీసుకువస్తే, శాంత్రో దానిని తర్వాతి స్థాయికి తీసుకువెళ్లింది. హ్యుందాయ్ తమ శాంత్రో కారును మార్కెట్ నుంచి తొలగించినప్పటికీ, కస్టమర్ల కోసం స్పేర్ పార్ట్‌లను, సర్వీస్ సపోర్టును అందుబాటులో ఉంచనుంది.

శాంత్రో కారులో మొదటి మేజర్ అప్‌డేట్ 2003లో జరిగింది. అప్పట్లో ఈ కారు డిజైన్ అప్‌డేట్ చేయటమే కాకుండా, దీనికి శాంత్రో జింగ్ అనే పేరును కూడా పెట్టారు. అంతేకాకుండా.. ఆ సమయంలో 1.1 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను కూడా పరిచయం చేశారు. మొదటి తరం శాంత్రో (1997-20003) కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించేవారు.

More from DriveSpark

Article Published On: Saturday, December 13, 2014, 11:13 [IST]
English summary
Hyundai Motor India bids farewell to its first and best selling small car Santro. Hyundai started its journey in India with the Santro in the year 1998.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+