హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ రూ.5.95 లక్షలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు ఆటోమేటిక్ వేరియంట్లో కూడా లభ్యం కానుంది. గ్రాండ్ ఐ10 పెట్రోల్ వెర్షన్‌లో కంపెనీ తాజాగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్) కలిగిన వేరియంట్‌ను విడుదల చేసింది. దీంతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్ వెర్షన్ ఇప్పుడు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభ్యం కానుంది.

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. కాగా.. ఆటోమేటిక్ గ్రాండ్ ఐ10 కేవలం రెండు వేరియంట్లలో (స్పోర్ట్స్, ఆస్టా) మాత్రమే లభిస్తుంది.


గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఆటోమేటిక్ వేరియంట్లో పవర్ స్టీరింగ్, ఆల్ పవర్ విండోస్, ఎలక్ట్రిక్ ఓవిఆర్ఎమ్, ఇంటిగ్రేటెడ్ 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ క్రోమ్ హ్యాండిల్స్, రూఫ్ రెయిల్స్, టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. గ్రాండ్ ఐ10 ఆస్టా ఆటోమేటిక్ వేరియంట్లో ఈ ఫీచర్లకు అధనంగా, రియర్ డిఫాగ్గర్, స్పాయిలర్, అల్లాయ్ వీల్స్, బ్లూటూత్, ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కోసం 1జిబి ఆన్-బోర్డ్ మెమరీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

దేశీయ విపణిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ (పెట్రోల్ వెర్షన్) ధరలు ఇలా ఉన్నాయి:

  • గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ : రూ.5.95 లక్షలు
  • గ్రాండ్ ఐ10 ఆస్టా : రూ.6.23 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)


ఇదిలా ఉండగా.. హ్యుందాయ్ అందిస్తున్న డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో కూడా ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారత్‌లో హ్యుందాయ్‌కు తొలి ఎంట్రీ లెవల్ డీజిల్ కారుగా నిలిచిన గ్రాండ్ ఐ10లో 1.1 లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 69 హార్స్ పవర్‌ల శక్తిని, 153 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2013, 17:07 [IST]
English summary
Hyundai started to sell Grand i10 automatic variants (petrol version). The four-speed automatic gearbox is available in only the petrol engine variant (Sportz, Asta variants). Hyundai Grand i10 AT is priced at Rs 5.95 lakh for the Sportz and Rs 6.23 lakh for Asta (all prices, ex-showroom, Mumbai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+