హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ ప్లాట్‌ఫామ్‌పై రానున్న సెడాన్ వెర్షన్

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా వచ్చే నెల 3వ తేదీన తమ సరికొత్త కాంపాక్ట్ డీజిల్ కారు ఐ10 గ్రాండ్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఐ10 గ్రాండ్ కేవలం హ్యాచ్‌బ్యాక్ రూపంలోనే కాకుండా, సెడాన్ రూపంలో కూడా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ప్రథమార్థంలో హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఇది పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండి ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ కార్లకు పోటీగా ఇవ్వనుంది. ఇది ఉత్పత్తి దశకు చేరుకుంటే, భారత మార్కెట్లో హ్యుందాయ్ నుంచి లభ్యం కానున్న చవక సెడాన్‌గా ఇది నిలువనుంది.


ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా అందిస్తున్న యాక్సెంట్ సెడాన్ స్థనాన్ని ఇది భర్తీ చేసే ఆస్కారం ఉంది. ఈ కాంపాక్ట్ సెడాన్‌లో ఉపయోగించనున్న ఇంజన్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌లో ఉపయోగించనున్న 1.2 లీచర్ కప్పా పెట్రోల్ ఇంజన్, అలాగే సరికొత్త త్రీ-సిలిండర్ 1.1 లీటర్ విజిటి 'యూ2' డీజిల్ ఇంజన్లనే ఈ కాంపాక్ట్ సెలూన్‌లోను ఉపయోగించనున్నారు.

హ్యుందాయ్ ఐ20లో ఉపయోగిస్తున్న 1.4 లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఇందులో అమర్చే అవకాశాలు లేవు. దీన్నిబట్టి చూస్తే, 1.1 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన ఐ10 గ్రాండ్ సెడాన్, ఈ సెగ్మెంట్లో పెద్ద డీజిల్ ఇంజన్లు కలిగిన అమేజ్, డిజైర్ వంటి మోడళ్లో పెర్ఫామెన్స్ పరంగా పోటీపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Hyundai i10 Grand Hatchback

ఇక హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఐ10 మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 మోడళ్లకు మధ్యలో ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‍‌‌ను ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 3, 2013న తొలిసారిగా దీనిని భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం అదే నెలలో జరిగే 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో కూడా హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించనున్నారు.

\

More from DriveSpark

Article Published On: Saturday, August 10, 2013, 9:08 [IST]
English summary
According to sources, after the launch of i10 Grand hatchback, Hyundai might introduce sedan of version of the same. Hyundai is developing a sedan version of the Grand i10, which is likely to hit Indian roads in the first half of 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+