పూనేలోని డీలర్‌షిప్‌లో ప్రదర్శనకు ఉంచిన వెలాస్టర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారును చూస్తుంటే ఏమైనా గుర్తుకు వచ్చిందా..? గడచిన సంవత్సరం ఢిల్లీలో 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆవిష్కరించిన క్రాసోవర్ కాన్సెప్ట్ 'హ్యుందాయ్ వెలాస్టర్' ఇప్పుడు మళ్లీ ఇండియాలో దర్శనమిస్తోంది. పూనేలోని గార్వ్ హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో ఈ పసుపు రంగు వెలాస్టర్ కారును ప్రదర్శనకు ఉంచడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంసం అయింది.
హ్యుందాయ్ తొలిసారిగా వెలాస్టర్‌ను 2007లో జరిగిన సియోల్ మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శనకు ఉంచింది. ఆ తర్వాత 2011లో జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో ప్రొడక్షన్ సిద్ధంగా ఉన్న వెలాస్టర్‌ను ప్రదర్శనకు ఉంచింది. అదే సమయంలోనే దక్షిణ కొరియా, అమెరికాలలో ఈ మోడల్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా హ్యుందాయ్ వెలాస్టర్ భారత మార్కెట్లో దర్శనమివ్వడాన్ని బట్టి చూస్తుంటే, త్వరలోనే ఈ కారు ఇక్కడి మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హ్యుందాయ్ వెలాస్టర్

హ్యుందాయ్ వెలాస్టర్
పూనేలోని గార్వ్ హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో ప్రదర్శనకు ఉంచిన హ్యుందాయ్ వెలాస్టర్ కారు.

హ్యుందాయ్ వెలాస్టర్
పూనేలోని గార్వ్ హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో ప్రదర్శనకు ఉంచిన హ్యుందాయ్ వెలాస్టర్ కారు.

హ్యుందాయ్ వెలాస్టర్
ప్రొడక్షన్ వెర్షన్ హ్యుందాయ్ వెలాస్టర్.

హ్యుందాయ్ వెలాస్టర్
2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన హ్యుందాయ్ వెలాస్టర్.

ఈ కారును స్టయిల్ మైండెడ్ కలిగిన 20-30 ఏళ్ల వయో గ్రూపును దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ డిజైన్ చేసింది. ఇందులో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్లు కలిగిన 1.6 లీటర్ గామ్మా జిడిఐ ఇంజన్‌ను అమర్చారు. ఇంకా ఇందులో 7 ఇంచ్ మల్టీ మీడియా టచ్ స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, నావ్‌ట్రాఫిక్‌తో కూడిన ఎక్స్ఎమ్ శాటిలైట్ రేడియో, పవర్ సీట్స్, రివర్స్ కెమెరా, 450 వాట్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన ప్రాక్సిమిటీ కీ ఎంట్రీ, మరింత సౌకర్యం కోసం ఫ్రంట్, రియర్ సీట్లలో ఎయిర్ వెంటిలేషన్, వాయిస్ రికగ్నైజేషన్‌తో కూడిన బ్లూటూత్, పానడోరా ఇంటర్నెట్ రేడియో, బ్లూ లింక్-వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. పూర్తి భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సి)తో కూడిన వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) ఫీచర్లు కూడా ఉన్నాయి.

Click it and Unblock the Notifications