హ్యందాయ్ వెర్నా సిఎక్స్ వేరియంట్ ధర వెల్లడి
హోండా కార్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన సరికొత్త 2014 సిటీ సెడాన్‌కు పోటీగా హ్యుందాయ్ ఓ టాప్-ఎండ్ వేరియంట్ వెర్నా సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, 'హ్యుందాయ్ వెర్నా సిఎక్స్' (Hyundai Verna CX) పేరిట కంపెనీ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోవిడుదల చేసింది.
కొత్త హ్యుందాయ్ వెర్నా సిఎక్స్ వేరియంట్ కేవలం 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే లభ్యం కానుంది. ఈ కొత్త డీజిల్ వేరియంట్ వెర్నా సిఎక్స్‌లో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రియర్ డిస్క్ బ్రేక్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా (పార్కింగ్ సెన్సార్లతో), డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్ మొదలైన ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

కొత్త హ్యుందాయ్ వెర్నా సిఎక్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* వెర్నా సిఎక్స్ (1.4 లీటర్ పెట్రోల్) - రూ.8.49 లక్షలు
* వెర్నా సిఎక్స్ (1.4 లీటర్ డీజిల్) - రూ.9.77 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, థానే)
హ్యుందాయ్ తమ వెర్నా సెడాన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేయటంతో పాటుగా ప్రస్తుత ప్రోడక్ట్ లైనప్‌లో కొద్దిపాటి మార్పులు కూడా చేసింది. అవి -
* 1.4 లీటర్ ఈఎక్స్ వేరియంట్‌ను నిలిపివేశారు.
* 1.6 లీటర్ ఈఎక్స్ ఆటోమేటిక్ వేరియంట్‌ను నిలిపివేశారు.
* 1.6 లీటర్ ఎస్ఎక్స్ (ఆప్షనల్) ఆటోమేటిక్ (విటివిటి) వేరియంట్‌ను నిలిపివేశారు.
* కొత్తగా పరిచయం చేసిన 1.4 లీటర్ సిఎక్స్ వేరియంట్‌తో పాటుగా మరొక కొత్త 1.6 లీటర్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేశారు.
* 1.6 లీటర్ ఎస్ఎక్స్ (ఆప్షనల్) వేరియంట్‌లో సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫీచర్లను జోడించారు.
* 1.6 లీటర్ ఎస్ఎక్స్ వేరియంట్‌లో సూపర్‌విజన్ క్లస్టర్, రియోస్టాట్ ఫీచర్లను తొలగించారు.
* 1.6 లీటర్ ఈఎక్స్ వేరియంట్లో, 1.4 లీటర్ సిఎక్స్ వేరియంట్లో ఆఫర్ చేస్తున్న అన్ని ఫీచర్లను (డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ మినహా) ఆఫర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








