సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రోను విడుదల చేయనున్న హ్యుందాయ్
దక్షిణ కొరియాకు చెందిన ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లోకి ప్రవేశించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ అందిస్తున్న పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ 'శాంత్రో జింగ్'లో ఓ సెలబ్రేషన్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.
రెగ్యులర్ వెర్షన్ శాంత్రో జింగ్‌తో పోల్చుకుంటే, ఈ సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో జింగ్‌లో మరిన్ని అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో జింగ్ కారులో లభ్యం కానున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

- ఆకర్షనీయమైన ప్రత్యేక బాడీ గ్రాఫిక్స్
- కారు వెనుక వైపు క్రోమ్ గార్నిష్
- ఎల్ఈడి డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్
- మ్యాన్యువల్ రియర్ సన్‌బ్లైండ్
- కొత్త ఫ్లోర్‌మ్యాట్స్ సెట్
- బ్రాపంక్ట్ స్టీరియో సిస్టమ్
ఇవేకాకుండా, శాంత్రో జింగ్‌ను కేవలం 7.44 శాతం ఫైనాన్స్ రేటుకే హ్యుందాయ్ ఆఫర్ చేస్తుంది. సెలబ్రేషన్ ఎడిషన్ శాంత్రో జింగ్ కేవలం జిఎల్ ప్లస్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. దీని ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








