భారత్‌లో దూసుకుపోతున్న రెనో డస్టర్ ఎస్‌యూవీ!

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న డస్టర్ ఎస్‌యూవీ అతి తక్కువ కాలంలోనే మంచి విజయాన్ని సాధించింది. భారతీయుల మది దోచుకోవటంలో విజయవంతమైన ఈ కారు ఇక్కడి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా రెనో డస్టర్ అత్యధిక అమ్ముడుపోతున్న దేశాల్లో మన భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. డస్టర్ విషయంలో రెనో కంపెనీ భారత మార్కెట్ నాల్గవ అతిపెద్ద మార్కెట్ కావటం విశేషం. గడచిన 2012లో భారత్‌లో రెనో డస్టర్ ఇప్పటి వరకు 85,974 మందికి పైగా కస్టమర్లకు చేరువయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రెనో డస్టర్ (డాసియా డస్టర్ - కొన్ని గ్లోబల్ మార్కెట్లలో ఇది రెనోకి చెందిన డాసియా బ్రాండ్ పేరుతో అమ్మడుపోతోంది) అమ్మకాలు 10 లక్షల యూనిట్లను అధిగమించాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Renault Duster

ప్రస్తుతం డస్టర్ ఎస్‌యూవీకి రష్యా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 1,51,633 యూనిట్లకు పైగా డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్ రెండవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 70,159 డస్టర్ ఎస్‌యూవీలు సేల్ అయ్యాయి.

మహీంద్రా స్కార్పియో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తున్న రెనో డస్టర్ ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో అమ్ముడుపోతోంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఫ్యాక్టరీలలో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.

భారత మార్కెట్లో రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ.7.78 లక్షల నుంచి రూ.11.79 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). గడచిన మార్చ్ నెలలో రెనో ఇండియా మొత్తం 4,494 డస్టర్ ఎస్‌యూవీలను విక్రయించగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 46,786 స్టర్ ఎస్‌యూవీలను విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Monday, April 14, 2014, 15:01 [IST]
English summary
Its been four years since the launch of the Duster and in that time the compact SUV has emerged as the best selling product for Renault Group. The Duster has now achieved its first major milestone by reaching the 1 million vehicle mark.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+