2015 నాటికి మార్కెట్లోకి రానున్న హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ హోండా అకార్డ్ (Honda Accord)లో ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చే ఏడాది నాటికి విడుదల కానుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో లగ్జరీ వాహనాలకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, నేటి ఆధునిక కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన అకార్డ్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

వాస్తవానికి హోండా కార్స్ ఇండియా ఇప్పటికే భారత్‌లో తమ అకార్డ్ ఉత్పత్తిని నిలిపివేసింది. భారత్‌లో మొదటి రెండు జనరేషన్లకు చెందిన హోండా అకార్డ్ మోడళ్లు మంచి విజయం సాధించినప్పటికీ, పడిపోతున్న రూపాయి విలువ ఈ లగ్జరీ బ్రాండ్ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. గడచిన సంవత్సరంలో హోండా తమ అకార్డ్ ఉత్పత్తి నిలిపివేసింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త హోండా అకార్డ్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

హోండా కార్స్ ఇండియా తొలిసారిగా 2008లో తమ అకార్డ్ లగ్జరీ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, అప్పట్లో ఇది కేవలవం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కావటం, దీని ధర కూడా అధికంగా ఉండటంతో, ఈ మోడల్‌ను కొనుగోలు చేసే వారి సంఖ్య నానాటికీ తగ్గుముఖం పట్టింది.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

ఈ నేపథ్యంలో, హోండా కార్స్ ఇండియా 2015 నాటికి ప్రవేశపెట్టబోయే తమ సరికొత్త అకార్డ్ లగ్జరీ సెడాన్‌లో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేసే ఆస్కారం ఉంది. హోండా ఇప్పటికే, తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అమేజ్, సిటీ డీజిల్ కార్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

కాగా.. కొత్త 2015 హోండా అకార్డ్ సెడాన్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి. కొత్త అకార్డ్ మునుపటి వెర్షన్ కన్నా చిన్నదిగా ఉండి, దాని కన్నా తక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

వాస్తవానికి కొత్త హోండా అకార్డ్ ఇదివరకటి తరం అకార్డ్ కన్నా బయటి నుంచి చిన్నదిగా ఉన్నప్పటికీ, ఇంటీరియర్ పరంగా మాత్రం ఇందులో అన్ని సౌకర్యాలను అలానే ఉంచారు. ప్రధానంగా ఇంటీరియర్ స్పేస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ వెర్షన్ 2015 హోండా అకార్డ్ సెడాన్‌లో 2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అకార్డ్‌లో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్న 2015 హోండా సిఆర్-వి క్రాసోవర్ కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న 1.6 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఈ కొత్త హోండా అకార్డ్ లగ్జరీ సెడాన్‌లో ఉపయోగించవచ్చని అంచనా.

2015 నాటికి హోండా అకార్డ్ ఫేస్‌లిఫ్ట్

కొత్త 2015 హోండా అకార్డ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2014, 11:10 [IST]
English summary
The all-new Honda Accord is said to make a re-entry into India by 2015. What can we expect? We take a closer look at the 2015 Honda Accord offerings.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+