మారుతి జిప్సీకి స్వస్తి పలకనున్న భారత సైన్యం

By Ravi

దశాబ్ధాల కాలంగా భారత సైన్యానికి సేవలందించిన 'మారుతి జిప్సీ' ఎస్‌యూవీ ఇకపై చరిత్రలో కలిసిపోనుంది. మారుతి సుజుకి జిప్సీ వాహనానికి ఇప్పటి వరకూ అతిపెద్ద కస్టమర్ ఇండియన్ ఆర్మీనే. అయితే, ప్రస్తుతం మారుతి జిప్సీ స్థానాన్ని మరింత సమర్థవంతమైన, అధునాతన ఎస్‌యూవీతో భర్తీ చేయాలని భారత సైన్యం భావిస్తోంది. ఇండియన్ ఆర్మీ వాహనంగా కొత్త ఎస్‌యూవీ రేసులో ఇప్పటికే మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ మోడళ్లు ముందున్నాయి.

భారత సైన్యం ఇప్పటి వరకూ దాదాపు 25,000 లకు పైగా మారుతి జిప్సీ ఎస్‌యూవీలను కొనుగోలు చేసింది. వాస్తవానికి ఆర్మీ వెర్షన్ మారుతి సుజుకి మంచి ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, సమర్థవంతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కొండలు, అడవులు వంటి ప్రాంతాల్లో రవాణాకు చక్కగా సరిపోతుంది. అయితే, మారుతి సుజుకి పెట్రోల్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండటం, పెట్రోల్ ఇంధన ధరలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో, దీని స్థానంలో డీజిల్‌తో నడిచే ఎస్‌యూవీలను ప్రవేశపెట్టాలని ఆర్మీ భావిస్చోంది.

ఈ నేపథ్యంలో, ఇండియన్ ఆర్మీ వచ్చే వారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ మిలటరీ వెర్షన్లతో సమ్మర్ ట్రైల్స్‌ను అలాగే, ఈ ఏడాది చివరి నాటికి సిక్కింలో వింటర్ ట్రైల్స్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. భారత సైన్యానికి దాదాపు 30,000 కొత్త లైట్ యుటిలిటీ 4x4 వాహనాలు అవసరం. ఈ 30,000 వాహనాలను దశల వారీగా కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. రానున్న 15-20 ఏళ్లలో పాత యుటిలీటీ వాహనాల స్థానాన్ని ఈ కొత్త యుటిలిటీ వాహనాలు భర్తీ చేయనున్నాయి.

మారుతి జిప్సీ ఫేజౌట్‌ను 2017 నాటికి పూర్తి చేయాలని మిలటరీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంటే, మిలటరీ మెషీన్‌గా ఇన్నాళ్లు భారత సైన్యానికి సేవలందించిన మారుతి జిప్సి ఇకపై చరిత్రకు పరిమితం కానుందన్నమాట..!

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

Maruti Gypsy SUV

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ

More from DriveSpark

Article Published On: Monday, May 13, 2013, 17:41 [IST]
English summary
Now Tata Safari and Mahindra Scorpio will replace to Maruti Gypsy in Indian army. Mauti Gypsy will be phased out by the Indian Army. Maruti Gypsy specs does not suit the army's standards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+