త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్స్ లీక్
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అదిగో ఇదిగో అంటూ తమ సూపర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఈకోస్పోర్ట్'తో కార్ ప్రియులను ఊరిస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ ప్రచారం కోసం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రోడ్ షోలు, పబ్లిక్ షోలు నిర్వహించింది. తాజా సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ వివరాలు అంతర్జాలంలో లీక్ అయ్యాయి.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‍యూవీ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి ఆంబీంటే, ట్రెండ్, టైటానియం, టైటానియం ఆప్షనల్. ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.0 ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్స్) లభించనుంది. ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే ఆస్కారాలు ఉన్నాయి.
మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..

Ford EcoSport
ఆంబీంటే వేరియంట్:
ఇది బేస్ వేరియంటే అయినప్పటికీ ఇందులో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో పాటుగా బ్లూటూత్ మరియు ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, మల్టీ ఫంక్షన్, ఫ్రంట్ పవర్ విండోస్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో పార్సెల్ ట్రే కనిపించదు.

Ford EcoSport
ట్రెండ్ వేరియంట్:
ఇక రెండవ వేరియంట్ ట్రెండ్ విషయానికి వస్తే, ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), పవర్ విండోస్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టమెంట్, స్టీరియో వీల్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Ford EcoSport
టైటానియం వేరియంట్:
టైటానియం వేరియంట్‌లో పైన తెలిపిన ఫీచర్లతో పాటుగా లెథర్ స్టీరింగ్ వీల్ కవర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లవ్ బాక్స్, రూఫ్ రెయిల్స్, ఫాగ్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, 16 అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Ford EcoSport
టైటానియం వేరియంట్ ఆప్షనల్:
ఈ టైటానియం వేరియంట్‌ను పుష్-బటన్ స్టార్ట్, లెథర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఆప్షనల్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Ford EcoSport

Ford EcoSport



Click it and Unblock the Notifications








