వాహనాల 'రీకాల్' నిబంధనలను కఠినతరం చేయనున్న భారత సర్కార్

By Ravi

విదేశాల్లో వాహనాల తయారీదారులు అత్యంత కఠినమైన సేఫ్టీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాహనాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించిన పది రోజుల తర్వాత కానీ లేదా 10 ఎళ్ల తర్వాత కానీ ఏదైనా తయారీ లోపం గుర్తిస్తే, ఆ బ్యాచ్‌కు చెందిన వాహనాలన్నింటినీ తప్పనిసరిగా రీకాల్ చేసి, లోపాలను గుర్తించి, సదరు సమస్యలను తయారీదారులే ఉచితంగా సరిచేయాల్సి ఉంటుంది. ఇలా వాహనాలను తయారీదారులు వెనక్కి పిలిపించే ప్రక్రియనే 'రీకాల్' (Recall) అంటారు.

ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా కఠినమైన సేఫ్టీ నిబంధనలు ఇప్పుడు మన దేశంలో కూడా అమల్లోకి రానున్నాయి. లోపపూరితమైన వాహనాల విషయంలో రీకాల్ నిబంధనలు కఠినతరం చేస్తూ భారత ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇటీవల జనరల్ మోటార్స్ ఇండియా తమ తవేరా ఎమ్‌పివి విషయంలో కాలుష్య నిబంధనలు తుంగలోకి తొక్కి ఉత్పత్తి చేపట్టడం, ఈ విషయం వెలుగులోకి రావటంతో 1.14 లక్షల వాహనాలను రీకాల్ చేయటం చేసిన సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, రీకాల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఏఆర్ఏఐ (ఆటోమేటివ్ రీసెర్చ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా) రూపొందిస్తుండగా, వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. గడచిన 2012 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలోని వివిధ కార్ల తయారీ కంపెనీలు రీకాల్ చేసిన మోడళ్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫోర్డ్

ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా గడచిన 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ మొత్తం 1,11,000 యూనిట్ల ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ కార్లను రీకాల్ చేసింది.

2012 నుంచి ఇప్పటి వరకు రీకాల్ చేసిన కార్లు

ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ (పెట్రోల్ వెర్షన్) - 17,655 యూనిట్లు

టొయోటా

టొయోటా

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ క్యామ్రీ 1,904 యూనిట్లను రీకాల్ చేసింది.

టొయోటా

టొయోటా

ఇదే సమయంలో టొయోటా అందిస్తున్న మరో సెడాన్ ఆల్టిస్ విషయంలోను 7,859 యూనిట్లను కంపెనీ రీకాల్ చేసింది.

హోండా

హోండా

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అందిస్తున్న సిబిఆర్250ఆర్ బైక్ విషయంలో కంపెనీ 11,506 యూనిట్లను రీకాల్ చేసింది.

నిస్సాన్

నిస్సాన్

నిస్సాన్ ఇండియా అందిస్తున్న చిన్న కారు 6,286 యూనిట్లను రీకాల్ చేసింది.

నిస్సాన్

నిస్సాన్

నిస్సాన్ ఇండియా అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ సెడాన్‌ను కూడా కంపెనీ రీకాల్ చేసింది. మొత్తం 15,902 యూనిట్లను రీకాల్ చేసింది.

రెనో

రెనో

ఇదే సమయంలో మొత్తం 2,836 యూనిట్ల రెనో పల్స్ హ్యచ్‌బ్యాక్ కార్లను కంపెనీ రీకాల్ చేసింది.

రెనో

రెనో

ఇదే సమయంలో మొత్తం 4,180 యూనిట్ల రెనో స్కాలా సెడాన్ కార్లను కూడా కంపెనీ రీకాల్ చేసింది.

హోండా

హోండా

హోండా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న సిటీ సెడాన్ కూడా రీకాల్‌కు గురైంది. 2012 నుంచి ఇప్పటి వరకు 42,672 కార్లను రీకాల్ చేశారు.

జనరల్ మోటార్స్

జనరల్ మోటార్స్

జనరల్ మోటార్స్ అందిస్తున్న చెవర్లే తవేరాలో కాలుష్య నిబంధనల సమస్య కారణంగా 1,14,000 కార్లను రీకాల్ చేశారు.

మూలం: ఎకనామిక్ టైమ్స్

More from DriveSpark

Article Published On: Saturday, November 9, 2013, 9:55 [IST]
English summary
Car manufacturers in India will soon have to follow stricter rules which will be implemented by the Indian government relating to recall of faulty vehicles. This development is the direct result of the General Motors fiasco which saw 1.14 lakh Tavera MPVs being recalled following revelation of fudged engine and emission information provided by the American automaker to Automotive Research Association of India (ARAI) during testing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+