స్విఫ్ట్ డీజిల్ తక్షణ డెలివరీ; రిట్జ్‌పై భారీ డిస్కౌంట్స్
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవటానికి కొనుగోలుదారులు ఇప్పుడు నెలల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ను ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అప్పటికప్పుడే డెలివరీ చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకప్పుడు ఇదే కారును కొనుగోలుదారులు 6-9 నెలలకు వరకూ వేచి ఉన్న రోజులు కూడా ఉన్నాయి.
ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ అన్ని విధంగా, ఈ కారను డెలివరీ చేయనున్నారు. అయితే, దీనిపై ఎలాంటి డిస్కౌంట్లను కంపెనీ అందించడం లేదు, పైగా ఈ స్కీమ్ మార్చి 17 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఇదిలా ఉండగా, కంపెనీ అందిస్తున్న మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ కారుపై రూ.45,000 మరియు మారుతి సుజుకి రిట్జ్ పెట్రోల్ కారుపై రూ.25,000 తగ్గింపును కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతుండటంతో డీలర్లు మరియు కంపెనీ స్టాక్ యార్డులలో కార్ల స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. జోరుగా సాగుతున్న డీజిల్ కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు మారుతి సుజుకి ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. పెట్రోల్ కార్లకు కూడా డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీ తమ గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తిని తగ్గించిన విషయం తెలిసినదే.

స్విఫ్ట్ డీజిల్ ఇన్‌స్టాంట్ డెలివరీ
మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ను ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అప్పటికప్పుడే డెలివరీ చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

స్విఫ్ట్ డీజిల్ ఇన్‌స్టాంట్ డెలివరీ
ఒకప్పుడు ఇదే కారును కొనుగోలుదారులు 6-9 నెలలకు వరకూ వేచి ఉన్న రోజులు కూడా ఉన్నాయి.

స్విఫ్ట్ డీజిల్ ఇన్‌స్టాంట్ డెలివరీ
ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ అన్ని విధంగా, ఈ కారను డెలివరీ చేయనున్నారు. అయితే, దీనిపై ఎలాంటి డిస్కౌంట్లను కంపెనీ అందించడం లేదు, పైగా ఈ స్కీమ్ మార్చి 17 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి రిట్జ్‌పై డిస్కౌంట్స్
మారుతి సుజుకి అందిస్తున్న మరొక ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ రిట్జ్‌పై కూడా కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్‌పై డిస్కౌంట్స్
డీజిల్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్‌పై కంపెనీ రూ.45,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్‌పై డిస్కౌంట్స్
పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్‌పై కంపెనీ రూ.25,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








