భారత ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలు

By Ravi

గడచిన కొన్ని దశబ్ధాలుగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ రంగంలో చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే, అనేక ఆసక్తికర విషయాలు మనకు గోచరిస్తాయి. భారత మార్కెట్లో ఒకప్పుడు కార్లంటే టక్కున గుర్తుకు వచ్చే మోడళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

అనతి కాలంలోనే భారత ఆటోమొబైల్ పరిశ్రమ శరవేగంగా విస్తరించింది. ప్రస్తుతం, భారతదేశంలో ఉన్న ఆటోమొబైల్ కంపెనీల్లో దేశీయ కంపెనీల కన్నా విదేశీయ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో మారుతి సుజుకి, ద్విచక్ర వాహన సెగ్మెంట్లో బజాజ్ ఆటో కంపెనీలు భారత ఆటోమొబైల్ పరిశ్రమ తీరుతెన్నులను మార్చడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం విదేశీ కంపెనీలకు సైతం ఆటోమొబైల్ హబ్‌గా మారిన 'భారత ఆటోమొబైల్ పరిశ్రమ' గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారును సృష్టించిన ఘనత మన దేశానికే దక్కింది. అమెరికన్లను దీనిని ఏమంటారో తెలుసా, భారతదేశంలో జస్ట్ 2500 డాలర్లు మాత్రమే ఖరీదు చేసే కార్ అంటారు.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న కార్ సెగ్మంట్ చాలా పెద్దది. అయితే, ఈ సెగ్మెంట్లో రూ.4 లక్షలకు దిగువన (ఎక్స్-షోరూమ్ ధర) ఖరీదు చేసే కారు ఒక్కటి కూడా అందుబాటులో లేదు.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి నెలకు 50 లక్షల కార్లు అమ్ముడవుతుండగా, ఇందులో భారత దేశం వాటా 4 శాతంగా ఉంది.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు మొత్తంగా 75 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన వాటాను 21 కార్ కంపెనీలు కలిగి ఉన్నాయి.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారతదేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ (సహ ఉత్పత్తుల ద్వారా) సుమారు ఒక కోటి మంది భారతీయులకు పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారతదేశం ప్రపంచంలో కెల్లా 7వఅతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారతదేశంలో కార్ సాంద్రత ప్రతి 1000 మంది ప్రజలకు 11 కార్లుగా మాత్రమే ఉంది. అయితే, ఢిల్లీ విషయానికి వస్తే, ప్రతి 1000 మందిలో 90 మంది కార్లను కలిగి ఉన్నారు. ఇది జాతీయ సగటు కన్నా 8 రెట్లు ఎక్కువ. మరి ఢీల్లీలో తరచూ ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణం ఏంటో అర్థమైందా?

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

రాజధాని నగరం ఢిల్లీలో సగటు ట్రాఫిక్ వేగం గంటకు 15 కిలోమీటర్లను మించదు.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారతదేశంలో ఆన్‌లైన్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించేందుకు, కొనుగోలు చేసేందుకు ప్రతినెలా సగటును 4.5 లక్షలకు పైగా గూగుల్ సెర్చ్‌లు జరుగుతున్నాయి.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

భారత్‌లో మారుతి సుజుకి అందిస్తున్న చిన్న సిటీ కార్ మారుతి 800. సుజుకి ఆల్టోకి రీబ్యాడ్జ్‌డ్ వెర్షనే ఇది. 1983 నుంచి ఇప్పటి వరకు సుమారు 2.5 మిలియన్లకు పైగా మారుతి 800 కార్లు అమ్ముడుపోయాయి. ఇదే కారును పాకిస్థాన్‌లో సుజుకి మెహ్రాన్ అనే పేరుతో విక్రయిస్తున్నారు.

ఈ ఆసక్తికర నిజాల గురించి తెలుసా?

ఆటోమొబైల్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 24, 2013, 14:13 [IST]
English summary
Indian automobile industry is an interesting one the fastest growing. Here are interesting & fascinating facts about Indian auto industry. Facts about Indian automobiles that you may not know.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+