ఉత్తర భారతదేశంలో ఇసుజు మోటార్స్ తొలి డీలర్‌షిప్ ప్రారంభం

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఇసుజు మోటార్స్ ఇండియా, ఇటీవలే దక్షిణ భారతదేశంలో విడుదల చేసిన తమ మేడ్ ఇన్ ఇండియా పికప్ ట్రక్స్ డి-మ్యాక్స్, డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్‌లను ఇప్పుడు ఉత్తర భారదేశంలోని కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఇజుసు మోటార్స్ ఉత్తర భారతదేశంలో కెల్లా తమ మొట్టమొదటి షోరూమ్‌ను గుర్గావ్‌లో ప్రారంభించింది.

గుర్గావ్‌లో ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ధరలు రూ.5.89 లక్షల నుంచి రూ.6.99 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఎన్‌సిఆర్) రేంజ్‌లో ఉన్నాయి. ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్ మొత్తం మూడు వేరియంట్లలో (సింగిల్ క్యాబ్ ఫ్లాట్ డెక్, స్పేస్ క్యాబ్ ఫ్లాట్ డెక్, స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్) లభిస్తుంది.


ఇందులో బేస్ వేరియంట్ డి-మ్యాక్స్ ఓ రెగ్యులర్ పికప్ ట్రక్, ఇది 2415 X 1705 X 450 (mm) ఫ్లాట్‌బెడ్‌ను కలిగి ఉండి, 1.2 టన్నుల పేలోడ్‌ను మోయగలదు. రెండవ వేరియంట్ అయిన స్పేస్ క్యాబ్ ఫ్లాట్ డెక్ సీట్ల వెనుక వైపు అదనంగా 1.5 అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుంది.

ఇకపోతే.. ఇందులో మూడవ వేరియంట్ స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్ ఓ ప్రీమియం పికప్ ట్రక్. వాస్తవానికి ఇది వాణిజ్యపరంగా ఉపయోగించుకునేందుకు కాకుండా, వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందు గాను ఉద్దేశించి తయారు చేయబడినది. ఇది ఫ్లాట్ బెడ్‌ను కాకుండా, వీల్ ఆర్చెస్ వలన హంప్‌లతో కూడిన బెడ్ ఉంటుంది. ఫలితంగా దీని కార్గో స్పేస్ (1920mm X 1720mm X 480mm) కూడా తక్కువగా ఉంటుంది. అయితే, ఇతర రెండు వేరియంట్లతో పోల్చుకుంటే, ఇది మరింత స్టయిలిష్‌గా ఉంటుంది.

D Max Pickup

రెగ్యులర్ పికప్ ట్రక్కులలో లభించిన కొన్ని విశిష్టమైన ఫీచర్లు ఈ డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్‌లో లభ్యం కానున్నాయి. డే-నైట్ రియర్ వ్యూ మిర్రర్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, బాడీ కలర్డ్ బంపర్స్, క్రోమ్ ఫినిష్ రేడియేటర్ గ్రిల్, ఇంజన్ టాకోమీటర్, ఫ్రంట్ సీట్ స్లైడ్ అండ్ రిక్లైన్, గ్రీన్ టింటెడ్ గ్లాస్, పవర్ విండోస్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్కులలో 2.5 లీటర్, 4-సిలిండర్, కామన్ రైల్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 136 హార్స్‌పవర్‌ల శక్తిని, 1800-3200 ఆర్‌పిఎమ్ వద్ద 294 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ ట్యాంక్‌పై (76 లీటర్లు) ఇది 1000 కి.మీ. దూరం వరకు నడుస్తుంది. అంటే దీని మైలేజ్ 13.15 కెఎమ్‌పిఎల్.

More from DriveSpark

Article Published On: Friday, May 30, 2014, 10:16 [IST]
English summary
Japanese manufacturer Isuzu Motors have inaugurated its first showroom in the North of India. They have also launched their new vehicle the D-Max, which is a pickup truck for India. The Japanese manufacturer will be entering the Northern part of India first.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+