ఇసుజు ఎమ్‌యూ-7.. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా..!

By Ravi

ఈ ఎస్‌యూవీని గుర్తుపట్టారా..? జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో దిగ్గజం 'ఇసుజు మోటార్స్' ఈ ఏడాది మార్చ్ నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన 'ఇసుజు ఎమ్‌యూ-7' ఎస్‌యూవీ ఇది. అప్పట్లో ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించే వారు, విడుదల సమయంలో దీని ధర రూ.24.16 లక్షలుగా ఉండేది.

కాగా.. ఇప్పుడు ఇసుజు మోటార్స్ తమ ఎమ్‌యూ-7 ఎస్‌యూవీని స్థానికంగా ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఈ విధంగా స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీని కంపెనీ నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది.


ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం వలన, దీని ధర దాదాపు రూ.2 లక్షలకు పైగా తగ్గింది. ప్రస్తుతం ఇది రెండు వెర్షన్లలో (బిఎస్3, బిఎస్4) లభ్యమవుతుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:
  • ఇసుజు ఎమ్‌యూ-7 బిఎస్3 - రూ.22 లక్షలు
  • ఇసుజు ఎమ్‌యూ-7 బిఎస్4 - రూ.22.3 లక్షలు

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీలో బిఎస్4 వెర్షన్ 3.0 లీటర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉఫయోగించారు. ఇది గరిష్టంగా 161 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Isuzu AP Govt Deal

ప్రస్తుతం ఇసుజు మోటార్స్‌కు హైదరాబాద్, కోయంబత్తూర్‌లలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. కాగా.. డిసెంబర్ 11న చెన్నైలో ఓ డీలర్‌షిప్‌ను ప్రారంభించనుంది. ఇసుజు 2015-16 నాటికి భారత్‌లో తమ డీలర్‌షిప్ కేంద్రాలను 60కు పెంచుకోవాలని యోచిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఇసుజుతో రాష్ట్ర ప్రభుత్వంతో మార్చి 15, 2013న ఓ అవగాహన ఒప్పందం (ఎమ్‌ఓయూ) కుదుర్చుకుంది. మొత్తం రూ.3,000 కోట్ల పెట్టుబడులతో, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 2015 నాటికి పూర్తిస్థాయిలో నిర్వహణలోకి రానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2013, 18:10 [IST]
English summary
Japanese auto major Isuzu Motors has launched the locally produced MU-7 SUV in India. The new Isuzu MU-7 SUV has been priced at Rs 22 lakh (BS III) and Rs 22.3 lakh (BS IV). The new MU-7 SUV is powered by a BS IV compliant 3.0-litre Common rail diesel engine that makes a healthy 161bhp.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+