గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో సిన్ ఆర్1 స్పోర్ట్స్ కారు

By Ravi

జర్మనీకి చెందిన స్పోర్ట్స్ కార్ కంపెనీ సిన్ (Sin) బ్రిటన్‌లో జరుగుతున్న 2013 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ఓ సరికొత్త కారును ఆవిష్కరించింది. 'సిన్ ఆర్1' పేరుతో విడుదలైన ఈ వైట్ కలర్ స్పోర్ట్స్ కారు 2013 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కారును ఇదివరకే 2013 ఆటోస్పోర్ట్ ఇంటర్నేషల్ ఈవెంట్‌లో ప్రదర్శించారు.

సిన్ ఆర్1 స్పోర్ట్స్ కారులో జనరల్ మోటార్స్ నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ ఎల్ఎస్‌3 6.2 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. (జనరల్ మోటార్స్ అందిస్తున్న చెవర్లే కార్వెట్టేలోను ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 525 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్రాజియానో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

సిన్ ఆర్1 స్పోర్ట్స్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌‌లో పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

సిన్ ఆర్1 స్పోర్ట్స్ కారులో 6.2 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 525 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ గ్రాజియానో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

లైట్ వెయిట్ నిర్మాణం

లైట్ వెయిట్ నిర్మాణం

సిన్ ఆర్1 స్పోర్ట్స్ కారు బరువును తక్కువగా ఉంచేందుకు గాను దీని బాడీ నిర్మాణంలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగించారు. దీని మొత్తం బరువు 1200 కేజీలు.

రియర్ వీల్ డ్రైవ్

రియర్ వీల్ డ్రైవ్

సిన్ ఆర్1లోని ఇంజన్ కారు మధ్యభాగంలో ఉంటుంది. ఇంజన్ నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి వెనుక చక్రాలకు పంపించబడుతుంది (రియర్ వీల్ డ్రైవ్).

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

సిన్ ఆర్1 స్పోర్ట్స్ కేవలం 3.0 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు.

బ్రేకింగ్ సిస్టమ్

బ్రేకింగ్ సిస్టమ్

ఈ కారులో ఏపి రేసింగ్ బ్రేక్ సిస్టమ్‌ను అమర్చారు. (ముందు వెనుక రేసింగ్ కాలిపర్స్ కోసం 362 మి.మీ. డిస్క్ బ్రేక్స్).

మరికొన్ని ఫీచర్లు

మరికొన్ని ఫీచర్లు

టైటన్ స్టీరింగ్ ర్యాక్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 265/35 ఫ్రంట్ టైర్, 325/30 రియర్ టైర్ వంటివి మరికొన్ని చెప్పుకోదగిన ఫీచర్లు. దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2013, 14:26 [IST]
English summary
The Sin R1 Super is fast and furious. We take a look at what this super-car has to offer. The Sin R1 super-car is a powered mystery, we dig this up for you.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+