జులై 8న మార్కెట్లోకి రానున్న జాగ్వార్ ఎఫ్-టైప్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ అభివృద్ధి చేసిన చేసి లేటెస్ట్ స్పోర్ట్స్ కార్ 'జాగ్వార్ ఎఫ్-టైప్' (Jaguar F-Type) వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన న్యూయార్క్ మోటార్ షోలో జాగ్వార్ ప్రొడక్షన్ వెర్షన్ ఎఫ్-టైప్‌ను ఆవిష్కరించింది. ఆ సందర్భంగా జాగ్వార్ కార్స్ గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ అడ్రియాన్ హాల్‌మార్క్ మాట్లాడుతూ, ఈ మోడల్‌ను జూన్-జులై మధ్య కాలంలో భారత్‌లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
అప్పుడు చెప్పినట్లుగానే, జాగ్వార్ తమ లేటెస్ట్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును జులై 8, 2013న దేశీయ విపణిలో విడుదల చేయనుంది. భారత మార్కెట్లో ఇది వి6ఎస్, వి8ఎస్ అనే రెండు వేరియంట్లలో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును స్టన్నింగ్ లుక్స్, అమేజింగ్ పెర్ఫామెన్స్‌ల కలయికతో అభివృద్ధి చేశారు.
వి6ఎస్ వేరియంట్ 380 పిఎస్‌ల పవర్‌ని, 460 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగా, వి8ఎస్ వేరియంట్ 495 పిఎస్‌ల పవర్‌ని, 625 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటాయి. భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-టైప్ ధరలు రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేసట్స్ కోసం తెలుగు డ్రైవ్‍స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.













Click it and Unblock the Notifications








