భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల; వివరాలు

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ 'జాగ్వార్' గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల కన్వర్టిబల్ వెర్షన్ 'ఎఫ్-టైప్' స్పోర్ట్స్ కారుకు కొనసాగింపుగా, పర్మినెంట్ హార్డ్ రూఫ్ కలిగిన ఎఫ్-టైప్ కూపేను కంపెనీ విడుదల చేసింది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే కూడా కన్వర్టిబల్ వెర్షన్ మాదిరిగా మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి - ఎఫ్-టైప్ స్టాండర్డ్, ఎఫ్-టైప్ ఎస్ మరియు ఎఫ్-టైప్ ఆర్. జాగ్వార్ తమ ఎఫ్-టైప్ కూపేని తొలిసారిగా 2013లో జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో ఆవిష్కరించింది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్లు, ధరలు మరియు ఇతర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

స్టాండర్డ్ వేరియంట్ ఎఫ్-టైప్ కూపేలో 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 340 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు (కన్వర్టిబల్ మాదిరిగానే). దీని గరిష్ట వేగం గంటకు 259 కి.మీ.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

మిడ్ లెవల్ వేరియంట్ ఎఫ్-టైప్ ఎస్ కూపేలో 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 380 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు (కన్వర్టిబల్ మాదిరిగానే). దీని గరిష్ట వేగం గంటకు 275 కి.మీ.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

టాప్ ఎండ్ వేరియంట్ ఎఫ్ టైప్ ఆర్ కూపేలో 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 550 హెచ్‌పిల శక్తిని (కన్వర్టిబల్ కన్నా 55 హెచ్‌పిలు అదన) ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.0 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు దీని గరిష్ట వేగం గంటకు 300 కి.మీ.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ఈ మూడు వేరియంట్లు కూడా జెడ్ఎఫ్ 8-స్పీడ్ 'క్విక్‌షిఫ్ట్' ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. ఈ గేర్లను ప్యాడెల్ షిఫ్టర్స్ ద్వారా ఫుల్ మ్యాన్యువల్ సీక్వెన్షనల్ కంట్రోల్‌తో కానీ లేదా సెంట్రల్ 'స్పోర్ట్‌షిఫ్ట్' లివర్ ద్వారా కానీ మార్చుకోవచ్చు.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ఈ ఎఫ్-టైప్ కూపే మోడళ్లు సెకండ్ జనరేషన్ ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ మరియు కొత్త టార్క్ వెక్టరింగ్ సిస్టమ్‌లతో లభిస్తాయి. ఇవి మంచి హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తాయి.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ఇది కూపే బాడీ టైప్ కావటంతో, కారు పైభాగం అల్యూమినియంతో కానీ లేదా గ్లాస్ రూఫ్‌తో కానీ లభిస్తుంది.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ఎఫ్-టైప్ కూపే‌ వెనుక వైపు బూట్ స్పేస్ కూడా ఉంటుంది. కన్వర్టిబల్ మాదిరిగా కాకుండా ఇది మరింత ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంటుందని, ఇందులో రెండు పెద్ద గోల్ఫ్ కిట్లను ఉంచవచ్చని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ఈ కారులో మరో ప్రత్యేకత ఏంటంటే, కారు బూట్‌పై ఓ యాక్టివ్ స్పాయిలర్ ఉంటుంది. గంటకు 112 కి.మీ. పైగా వేగంతో వెళ్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా బయటకు వస్తుంది. అలాగే గంటకు 80 కి.మీ. కన్నా తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్లిపోతుంది. ఈ స్పాయిలర్ వెనుక వైపు 120 కేజీల డౌన్‌ఫోర్స్‌ను అప్లయ్ చేస్తుంది.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

అధిక ఛాస్సిస్ ధృఢత్వం, తక్కువ బరువు కారణంగా ఇది కన్వర్టిబల్ వెర్షన్ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. (కన్వర్టిబల్ క్నా ఎఫ్-టైప్ వి6 కూపే దాదాపు 50 పౌండ్లు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఎఫ్-టైప్ ఆర్ కూపే బరువు మాత్రం వి8 కన్వర్టిబల్‌తో సమానంగా ఉంటుంది).

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ఎఫ్-టైప్ ఆర్ కూపే బరువు కన్వర్టిబల్ వెర్షన్‌తో సమానంగా ఉంటుంది కాబట్టి, దీని సస్పెన్షన్‌ను రీట్యూన్ చేశారు. అలాగే అడాప్టివ్ డ్యాంపింగ్ సాఫ్ట్‌వేర్ సెట్టింగ్స్‌ను కూడా మార్చారు. ఫలితంగా ఇది మరింత మెరుగైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే విడుదల

ధరలు:

ఎఫ్-టైప్ కూపే - రూ.1.21 కోట్లు

ఎఫ్-టైప్ ఎస్ కూపే - రూ.1.50 కోట్లు

ఎఫ్-టైప్ ఆర్ కూపే - రూ.1.82 కోట్లు

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2014, 18:37 [IST]
English summary
Jaguar has launched a Coupe version of its F-Type sports car in India. Available with three engine options, the F-Type Coupe will come in standard, S and the top-of-the-line R specification. The Jaguar F-Type Coupe price starts at Rs 1.21 Crore (ex-showoom, Mumbai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+