భారత్‌లో జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్ కారు విడుదల
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తమ అధునాతన టూ సీటర్ స్పోర్ట్స్ కారు 'జాగ్వార్ ఎఫ్-టైప్' భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో జాగ్వారా ఎఫ్-టైప్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ప్రారంభ వేరియంట్ (ఎఫ్-టైప్ ఎస్) ధర రూ.1.37 కోట్లుగాను, టాప్-ఎండ్ వేరింట్ ధర (ఎఫ్-టైప్ వి8ఎస్) రూ.1.61 కోట్లు గాను నిర్ణయించినట్లు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై) కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్ వేరియంట్‌లో 3.0 లీటర్ వీ6 సూపర్‌చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 380 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 4.9 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 275 కిలోమీటర్లు.
ఇకపోతే, జాగ్వార్ ఎఫ్-టైప్ వి8ఎస్ వేరియంట్లో శక్తివంతమైన 5.0 లీటర్ సూపర్‌చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 495 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 4.3 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 300 కిలోమీటర్లు.

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు
ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి మాట్లాడుతూ.. తాము ప్రవేశపెట్టిన సరికొత్త జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు తమ కంపెనీ బ్రాండ్ డిమాండ్‌ను మరింతగా పెంచుతుందన్న విశ్వాసం ఉందని అన్నారు. భారత్‌లో స్పోర్ట్స్ కార్ల మార్కెట్ పరిమాణం చాలా తక్కువ స్థాయిలో ఉన్నందున, ఈ సెగ్మెంట్లో ప్రత్యేకించి అమ్మకాల టార్గెట్‌ను ఏమీ నిర్దేశించుకోలేదని ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో కార్లను విక్రయించాలన్న వ్యూహంతో దీనిని తీసుకురాలేదని, తమ సాంకేతికత సత్తాను చాటేందుకే ఈ కారును సృష్టించామని రోహిత్ చెప్పారు.
ప్రస్తుతానికి జేఎల్ఆర్ తమ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయించనుంది. అయితే, రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులకు వచ్చే డిమాండ్‌ను బట్టి, వాటిని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తామని ఆయన చెప్పారు. అయితే ఏయే మోడళ్లను అసెంబ్లింగ్ చేసే అంశాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్‌లో తాము అందిస్తున్న జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ సెడాన్‌కు మంచి స్పందన లభిస్తోందని, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 68 శాతం వృద్ధి చెందడానికి ఈ కారే కారణమని రోహిత్ తెలిపారు.


Click it and Unblock the Notifications








