భారత్‌కు వస్తున్న జాగ్వార్ ఓపెన్ టాప్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ నుంచి ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారు ఇండియాకు రాబోతుంది. అందమైన లుక్, అసాధ్యమైన పెర్ఫామెన్స్‌తో స్పీడ్ కార్ ప్రియులకు ఓ సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు గాను జాగ్వార్ తమ ఎఫ్-టైప్ ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారును రానున్న జులై 2013లో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గతంలో జాగ్వార్ ఆవిష్కరించిన సి-ఎక్స్16 కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని జాగ్వార్ తమ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేసింది.

జాగ్వార్ తొలుత సాఫ్ట్ టాప్ వెర్షన్ ఎఫ్-టైప్ కారును మాత్రమే ప్లాన్ చేసినప్పటికీ, అనంతరం ఇందులో పూర్తిగా ఓపెన్ టాప్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇది మూడు వేరియంట్లలో మార్కెట్లో లభ్యం కానుంది.

  • జాగ్వార్ ఎఫ్-టైప్ (3.0 లీటర్ వి6, 335 బిహెచ్‌పి, కేవలం 5.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం)
  • జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్ (3.0 లీటర్ వి6, 375 బిహెచ్‌పి, కేవలం 4.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం)
  • జాగ్వార్ ఎఫ్-టైప్ వి8 ఎస్ (3.0 లీటర్ వి8, 488 బిహెచ్‌పి, కేవలం 5.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం)

ఈ కార్లలోని ఇంజన్లను 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. భారత మార్కెట్లో ఈ కార్ల ధరలు రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. 2012లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో జాగ్వార్ తమ ఎఫ్-టైప్ కారును ఆవిష్కరించింది. ఇది ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ జెడ్4, పోర్షే బాక్స్టర్, మెర్సిడెస్ ఎస్ఎల్‌కె క్లాస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. మరి ఈ టాప్‌లెస్ బ్యూటీపై ఓ కన్నేద్దాం రండి..!

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2013, 14:52 [IST]
English summary
Jaguar F-Type is the most awaited Jaguar in India. The F-Type, launched globally last year, has been universally praised for its design and performance alike. Jaguar F-Type, which is based on the C-X16 concept, is considered one of the best cars for anyone looking for an open top sports car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+