బెంగుళూరులో 2014 జాగ్వార్ ఎక్స్‌జే విడుదల

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన 2014 జాగ్వార్ ఎక్స్‌జే లగ్జరీ కారును తాజాగా బెంగుళూరు మార్కెట్లో విడుదల చేసింది. దాదాపు ఏడాది క్రితమే ఈ మోడల్‌ను జాగ్వార్ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాలో ప్రవేశపెట్టింది.

కాగా.. ఇప్పుడు ఈ కొత్త 2014 జాగ్వార్ ఎక్స్‌జే మోడల్‌ను మహారాష్ట్రలోని పూనేలో ఉన్న ప్లాంట్ వద్ద అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఈ మోడల్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూపంలో విడిభాగాలను ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే దీనిని అసెంబ్లింగ్ చేస్తున్నారు. జాగ్వార్ ఎక్స్‌జే కారును స్థానికంగా భారత్‌లో అసెంబ్లిగ్ చేయటం వలన దీని ధర భారీగా తగ్గింది.


ప్రస్తుతం 2014 జాగ్వార్ ఎక్స్‌జే ప్రారంభ ధర రూ.93.74 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. జాగ్వార్ ఇప్పటికే తమ ఎక్స్ఎఫ్ సెడాన్‌ను స్థానికంగా భారత్‌లో అసెంబుల్ చేస్తోంది. కాగా.. జాగ్వార్ ఎక్స్‌జే మోడల్‌కు ఇండియన్ మార్కెట్ నుంచి మంచి గిరాకీ లభిస్తున్న నేపథ్యంలో, ఈ మోడల్‌ను కూడా ఇండియాలో అసెంబుల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది.

ఇదివరకు జాగ్వార్ తమ ఎక్స్‌జే మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించేంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా దీని ధర రూ.1.16 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

Jaguar Launches 2014 XJ

జాగ్వార్ స్థానికంగా అసెంబుల్ చేస్తున్న డీజిల్ వెర్షన్ ఎక్స్‌జే వేరియంట్‌లో 2993సీసీ, 6-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 275 పిఎస్‌ల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉటుంది.

కొత్త 2014 జాగ్వార్ ఎక్స్‌జే కేవలం 6.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇతర జాగ్వార్ కార్ల మాదిరిగానే ఇది కూడా అనేక అధునాత టెక్నికల్, కంఫర్ట్, లగ్జరీ మరియు సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 14, 2014, 10:16 [IST]
English summary
Tata Motors owned Jaguar has launched its super luxurious Jaguar XJ in Bengaluru on 12th July, 2014. The British icon had introduced its luxury vehicle in India, just a year ago. Jaguar's manufacturing facility is situated in Pune, Maharashtra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+