ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో జాగ్వార్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తొలిసారిగా ఎస్‌యూవీలపై అభివృద్ధిపై దృష్టి సారించినట్లు గడచిన నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ విషయంలో తాజా అప్‌డేట్ ప్రకారం, రానున్న సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో జాగ్వార్ తమ తొలి ఎస్‌యూవీని ఆవిష్కరించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
జాగ్వార్ ఇప్పటి వరకు పెర్ఫామెన్స్ సెడాన్లను, స్పోర్ట్స్ కార్ల తయారీలో ఓ ప్రత్యేకమైన గ్లోబల్ ఐడెంటెటీని సొంతం చేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీలో జాగ్వార్ బ్రాండ్ క్రింద సెడాన్లు, స్పోర్ట్స్ కార్లను అలాగే ల్యాండ్ రోవర్ బ్రాండ్ క్రింద పవర్‌ఫుల్ ఎస్‌యూవీలను, ఆఫ్-రోడింగ్ వాహనాలను తయారు చేస్తూ వచ్చారు. కాగా తొలిసారిగా పాపులర్ జాగ్వార్ బ్రాండ్ క్రింద ఎస్‌యూవీని తయారు చేయాలని కంపెనీ ప్రతిపాదించడంతో ఈ కొత్త మోడల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జాగ్వార్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

జాగ్వార్ ఎస్‌యూవీ పేరు
జాగ్వార్ అభివృద్ధి చేస్తున్న తమ తొలి ఎస్‌యూవీకి క్యూ టైప్ లేదా ఎక్స్‌క్యూ టైప్ అనే పేరును పెట్టే అవకాశం ఉందని, ఈ పేర్ల కోసం కంపెనీ ఇప్పటికే పేటెంట్లకు కూడా ధరఖాస్తు చేసుకున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.

2013 ఫ్రాంక్‌ఫార్ట్ మోటార్ షోలో ఆవిష్కరణ
ఈ ఏడాది సెప్టెంబర్ నెల ఆరంభంలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫార్ట్ మోటార్ షోలో జాగ్వార్ తమ తొలి ఎస్‌యూవీని ఆవిష్కరించే అవకాశం ఉన్నాయనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

కొత్త 2.0 లీటర్ ఇంజన్
జాగ్వార్ విడుదల చేయనున్న ఈ ఎస్‌యూవీలలో ఉపయోగించేందుకు గాను కంపెనీ సరికొత్త 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

2015లో విడుదల
ప్రస్తుతం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో జాగ్వార్ బ్రాండ్‌లో కూడా యుటిలిటీ వాహనాలను ఆఫర్ చేసేందుకు కంపెనీ సిద్ధమయ్యింది. వీలైనంత త్వరగా ఈ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకవచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, 2015లో ఇది మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.

లేటెస్ట్ అప్‌డేట్స్
ఈ కొత్త సెడాన్, ఎస్‌యూవీలు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. జాగ్వార్ ఎంట్రీ లెవల్ సెడాన్, మొట్టమొదటి ఎస్‌యూవీలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








